టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరైన అనసూయ బుల్లితెరకు దూరం కావడంతో గతంతో పోల్చి చూస్తే ఆమె గురించి తక్కువగా చర్చ జరుగుతోంది.ప్రస్తుతం నటిగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగించాలని అనసూయ భావిస్తున్నారని తెలుస్తోంది.
సోషల్ మీడియా వేదికగా అనసూయపై ట్రోల్స్ వస్తుండగా వాటి గురించి అనసూయ పట్టించుకోవడం లేదు.అయితే తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.
ఆ వీడియోలో అనసూయ “నా గురించి నెగిటివ్ గా మాట్లాడే వాళ్లను నేను అస్సలు లెక్క చేయను.వాళ్ల గురించి పట్టించుకోకపోవడమే నా రుగ్మత” అని చెప్పుకొచ్చారు.
అనసూయ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.ఒకవైపు పాజిటివ్ రోల్స్ తో పాటు మరోవైపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కూడా అనసూయ కనిపిస్తున్నారని సమాచారం అందుతోంది.
సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రంగస్థలం సినిమాతో ఆమె జీవితం మలుపు తిరిగింది.పుష్ప ది రైజ్ సినిమా అనసూయ స్థాయిని మరింత పెంచింది.ప్రస్తుతం అనసూయ కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ లో నటిస్తుండగా ఈ వెబ్ సిరీస్ పై మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.అనసూయ చేసిన పోస్ట్ కు 30000కు పైగా లైక్స్ వస్తుండటం గమనార్హం.
నటిగా అనసూయ స్థాయి అంతకంతకూ పెరుగుతోంది.అనసూయకు రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే అందుతోందని సమాచారం అందుతోంది.యాంకర్ అనసూయ కెరీర్ పరంగా చక్కగా ప్లాన్ చేసుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగించాలని అనుకుంటున్నారు.అనసూయ తనపై ఎవరైనా విమర్శలు చేసినా ఆ విమర్శలకు ఘాటుగా బదులివ్వడం ద్వారా ప్రేక్షకులను మరింత ఎక్కువగా ఆకట్టుకుంటున్నారు.
అనసూయ రోజుకు 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.