ఆ హీరోల మూలంగానే ఆ స్థాయికి ఎదిగిన సత్యానంద్..

సత్యానంద్. తెలుగు సినిమాలతో పరిచయం ఉన్న చాలా మందికి ఈ పేరు తెలిసే ఉంటుంది.మంచి రచయితగా జనాల ఆదరణ పొందిన వ్యక్తి.పుట్టి పెరిగింది ఆంధ్రాలోనే అయినా.ఆ తర్వాత మద్రాసుకు వెళ్లాడు.ఈయన కేవలం 13వ ఏటనే రచయితగా మారాడు.

 Unknown Facts About Writer Sathyanand Details, Writer Sathyanand, About Writer S-TeluguStop.com

పలు పత్రికలకు కథలు రాసేవాడు.ఆయన రాసిన తొలి కథ ఆంధ్రప్రభ వీక్లీలో వచ్చింది.

ఆ తర్వాత సుమారు 10 డిటెక్టివ్ నవలలు రాశాడు.విజయ బాపినీడు పత్రికకు కూడా పలు కథలు రాశాడు.

సినిమాల్లోకి వెళ్లాలని సత్యానంద్ కు అనిపించేది.అప్పటికే ప్రముఖ దర్శకుడిగా వెలుగొందుతున్నాడు ఆదుర్తి సుబ్బారావు.

ఆయన సత్యానంద్ కు స్వయానా మామ.సినిమా కష్టాల్లోకి లాగడం ఎందుకు అని సత్యానంద్ ను ఎంకరేజ్ చెయ్యలేదు.అందుకే తను సినిమాల వైపు వెళ్లకుండా డిటెక్టివ్ నవలలు రాసేవాడు.

కొంత కాలం తర్వాత సుబ్బారావు.తాను మద్రాసులోనే ఉన్నట్లు తెలుసుకుని పిలిపించుకున్నాడు.ఓ లైన్ చెప్తాను.

దాన్ని డెవలప్ చేసుకుని రా అన్నాడు.నువ్వెలా చేస్తావో చూస్తా అన్నాడు.

ఆ పాయింట్ ను తీసుకుని 200 పేజీల నవల రాసినట్లు చెప్పాడు.దాని ఆధారంగా తెరకెక్కిందే మాయదారి మల్లిగాడు సినిమా.

అది చదివి సుబ్బారావు బాగుంది అన్నాడు.అయితే దీన్ని స్క్రీన్ ప్లే రూపంలో రాయాలన్నాడు.

నవలను స్క్రీన్ ప్లే రూపంలో ఎలా రాయాలో కూడా చెప్పాడు.

Telugu Shoban Babu, Krishna, Telugusenior, Tollywood-Movie

ఆయన చెప్పినట్లుగానే రాశాడు సత్యానంద్.అటు డైలాగ్ రైటర్ ని ఎవరినీ అనుకోలేదు.ఎల్లుండి షూటింగ్.

స్క్రీన్​ప్లే రాశావు కాబట్టి.రెండు సీన్లకు డైలాగులు కూడా రాయమని చెప్పాడు.

అలాగే రాశాడు సత్యానంద్.అంతేకాదు.

తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరమని చెప్పాడు.మొత్తానికి ఈ సినిమాకు రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.

Telugu Shoban Babu, Krishna, Telugusenior, Tollywood-Movie

ఈ సినిమా సమయంలో హీరో కృష్ణకు డైలాగులు చెప్పేవాడు.ఆయన డైలాగ్స్ బాగున్నాయని మెచ్చుకున్నాడు.ఈ సినిమా విడుదల అయ్యే సరికి  ఆయనకి 22 ఏండ్లు.కృష్ణ.సత్యానంద్ గురించి చాలా మందికి చెప్పాడు.కొత్త కుర్రాడు.

బాగా రాస్తున్నాడు అనేవాడు.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత పలు సినిమాలకు రచయితగా పని చేశాడు.శోభన్‌బాబుతో వరుసగా ఏడు సినిమాలు చేశాడు.

కృష్ణ, శోభన్‌బాబుకు ఇష్టమైన రచయితగా మారాడు సత్యానంద్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube