బొబ్బిలి రాజా దెబ్బకు అన్నదమ్ములు సూపర్ హిట్..

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్.తెలుగు సినిమా పరిశ్రమలో దీనికి ప్రత్యేక స్థానం.

 Unknown Facts About Bobbili Raja Movie , Bobbili Raja, Venkatesh, Suresh, Vani-TeluguStop.com

ఈ బ్యానర్ లో వచ్చిన ఎన్నో సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి.రామానాయుడు స్థాపించిన ఈ సంస్థ ఇప్పుడు అద్భుతంగా ముందుకు సాగుతుంది.

ఈ బ్యానర్ మీద వంద సినిమాలకు పైగా నిర్మిచాడు రామానాయుడు.ఆయన వారసులుగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు సురేష్, వెంకటేష్.

వీరిద్దరు కలిసి బొబ్బిలి రాజా సినిమా చేశారు.ఈ సినిమాకు సురేష్ దర్శకత్వం వహించగా.

వెంకటేష్ హీరోగా చేశాడు.వీరిద్దరికి మంచి గుర్తింపు తెచ్చింది ఈ సినిమా.

ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సురేష్ బాబుకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఆసక్తి ఉండేది.

అందుకే తన తండ్రితో కలిసి సినిమా చర్చల్లో పాల్గొనేవాడు.నిర్మాతగా ఎలా సక్సెస్ సాధించాలో తన తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు.అదే సమయంలో అమెరికాలో చదువుకున్న వెంకటేష్.కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు.వెంకటేష్ నటించిన రెండు మూడు సినిమాలు హిట్ అయినా.మాస్ ఇమేజ్ రాలేదు.

అదే సమయంలో సురేష్ బాబు ప్రొడక్షన్ బాధ్యతలు తీసుకున్నాడు.అప్పుడే బొబ్బిలి రాజా సినిమా తెరమీదకు వచ్చింది.

పరుచూరి బ్ర‌ద‌ర్స్ కథ రాశారు. బి.గోపాల్ దర్శకుడిగా ఓకే అయ్యాడు.

Telugu Bobbili Raja, Bollywood, Divya Bharati, Suresh, Vanishree, Venkatesh-Telu

ఈ సినిమాలో వెంకటేష్ కు అత్తగా వాణిశ్రీని తీసుకున్నారు.అయితే ముందుగా శారదను అనుకున్నారు.కానీ సురేష్ బాబు సూచనలతో వాణిశ్రీని తీసుకున్నారు.

హీరోయిన్ గా రాధను అనుకున్నారు.చివరకు కొత్త అమ్మాయిని తీసుకోవాలి అనుకున్నారు.

అదే సమయంలో బాలీవుడ్ లో సత్తా చాటుతున్న దివ్య భారతిని ఓకే చేశారు.ఈ సినిమా అప్పట్లో అద్భుత విజయాన్ని అందుకుంది.

వెంకటేష్ మాస్ హీరోగా తిరుగులేని గుర్తుంపు తెచ్చుకున్నాడు.మొత్తంగా ఈ సినిమాతో అన్నదమ్ములు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

నిర్మాతగా సురేష్ బాబు, హీరోగా వెంకటేష్ మంచి సక్సెస్ అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube