చంద్ర‌బాబు మీద మ‌రోసారి అలాంటి కామెంట్స్ చేసిన అచ్చెన్న‌.. నిజ‌మెంత‌..?

టీడీపీలో చంద్రబాబు త‌ర్వాత ఎక్కువ‌గా వినిపించే పేరు అచ్చెన్నాయుడు.పార్టీలో బ‌ల‌మైన నేత మాత్ర‌మే కాకుండా ఫ్యామిలీ మెంబ‌ర్ లా కూడా ఉన్నారు.

 Achenna Who Made Such Comments On Chandrababu Once Again .. Really ..?, Achennay-TeluguStop.com

అయితే అచ్చెన్నాయుడు ఆ మ‌ధ్య ఓ హోట‌ల్ లో పార్టీ లేదు బొక్కా లేదు అన్న‌ట్టు ఓ వీడియో సంచ‌ల‌నం సృష్టించింది.కాగా ఆ వీడియో ఫేక్ అంటూ అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చినా కూడా.

దానిమీద చంద్ర‌బాబు మాత్రం కొంచెం అస‌హ‌నంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న్ను కొంచెం దూరం పెడుతున్నార‌నే ప్ర‌చారం కూడా ఉంది.

కాగా ఇప్పుడు మ‌రో ప్ర‌చారం తెర మీద‌కు వ‌చ్చింది.

రీసెంట్ గా మరోసారి అచ్చెన్నాయుడు ఇలాంటి కామెంట్లు చేశార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అది కూడా చంద్ర‌బాబు నాయుడు మీద‌నే ఇలా మాట్లాడార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.మొన్న విశాఖప‌ట్నంలో రీసెంట్ గా విద్యుత్ ఉద్యోగ సంఘాల క్యాలెండర్ ను అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.

అయితే ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కొన్ని కామెంట్లు చేశార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంద‌తి.చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఒక ర‌కంగా మాట్లాడితే.

అధికారంలోకి వ‌చ్చాక మ‌రో విధంగా మాట్లాడుతారంటూ కామెంట్లు చేశారంట‌.

ఇందులో అర్థం ఏంటంటే.

చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన త‌ర్వాత మాత్రం అమ‌లు చేయ‌డ‌ని ఇన్ డైరెక్టుగా చెప్తున్నాడంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హామీలు అమ‌లు చేయ‌క‌పోయినా.

ఆయ‌న వెంట‌ప‌డి అయినా అమ‌లు చేసేలా చూస్తామని విద్యుత్ ఉద్యోగుల‌కు హామీ ఇచ్చాడ‌నే ప్ర‌చారం న‌డుస్తోంది.అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి వీడియోలు బ‌య‌ట‌కు రాలేదు.

కాబ‌ట్టి ఇందులో నిజ‌మెంత ఉందనే విష‌యం మాత్రం ఎవ‌రికీ తెలియ‌ట్లేదు.మ‌రి దీని మీద అచ్చెన్నాయుడు ఏమైనా స్పందిస్తారో లేదో అన్న‌ది మాత్రం చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube