ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది మరింత అప్రమత్తంగా ఉంటూ తమ రాజకీయ ప్రత్యర్థులకు ఎక్కడ అవకాశం ఉందక్కకుండా ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచించాల్సి ఉన్నా , తెలంగాణ బిజెపి( Telangana BJP )లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.కీలకమైన ఎన్నికల సమయంలో పార్టీలో అసంతృప్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ఇంకా టిక్కెట్ల ప్రకటన చేయకముందే పార్టీ మారేందుకు చాలామంది నేతలు సిద్ధమవుతున్నారు.
![Telugu Brs, Kavitha, Telangana Bjp, Telangana-Politics Telugu Brs, Kavitha, Telangana Bjp, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/KCR-brs-party-Kavitha-Telangana-BJP-Telangana-elections-Telangana-government-pcc.jpg)
ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకులతో పాటు, ఇటీవల బీఆర్ఎస్( BRS party ) నుంచి చేరిన నేతలు కాంగ్రెస్ లో చేరితేనే తమ రాజకీయ భవిష్యత్తుకు డోకా ఉండదు అని లెక్కలు వేసుకుంటున్నారట.మొన్నటివరకు తెలంగాణ అధికార పార్టీ బీ ఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బిజెపి కనిపించింది.అయితే ఒక్కసారిగా ఆ పార్టీ డల్ అయినట్టుగానే కనిపిస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ బాగా బలం పుంజుకుంది.బీఆర్ ఎస్ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ అన్నట్లుగా పరిస్థితి ఉండడంతో, బీఆర్ఎస్ , బిజెపిలోని అసంతృప్త నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్( Congress party ) వైపే చూస్తున్నారు.
బిజెపిలో కీలకంగా ఉన్న పదిమందికి పైగా నేతలు త్వరలోనే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ చేరబోతున్నట్లు సమాచారం.కాంగ్రెస్ లో చేరితే తమకు ఏ స్థాయిలో ప్రాధాన్యం దక్కుతుంది .నియోజకవర్గంలో టిక్కెట్ ఇస్తారా లేదా అనే అంశం నేతలను ఆరా తీస్తున్నారు.త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోవాలనే ఆలోచనలో బిజెపి అసంతృప్త నాయకులు ఉన్నారట .
![Telugu Brs, Kavitha, Telangana Bjp, Telangana-Politics Telugu Brs, Kavitha, Telangana Bjp, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/brs-party-Kavitha-Telangana-BJP-Telangana-elections.jpg)
వచ్చేనెల 5 లేదా 6 తేదీల్లో వీరంతా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుంది తెలుస్తుంది.ఎన్నికల సమయంలో ఈ విధంగా పార్టీని వీడి ఇతర పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండడం బిజెపి పెద్దల్లో ఆందోళన కలిగిస్తుంది.గతంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడుగా బండి సంజయ్ దూకుడుగా వ్యవహరించారు.ఆ బాధ్యతలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించారు.అయితే అప్పటి నుంచి పార్టీ నుంచి వలసలు పెరిగాయనే అభిప్రాయాలు తెలంగాణ రాజకీయాల్లో కలుగుతున్నాయి.అది కాకుండా ప్రజల్లో బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటే అన్న అభిప్రాయాలు కలుగుతుండడం, దీనికి తగ్గట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత( Kavitha ) అరెస్టు అవుతారనే హడావుడి జరిగినా, ఇప్పుడు ఆ వ్యవహారం సైలెంట్ అయిపోవడం, అంతేకాకుండా అసెంబ్లీ సీట్ల లో బీఆర్ఎస్ గెలిచేలా , ఎంపీ సీట్లలో బిజెపి గెలిచే విధంగా ముందుగానే బిఆర్ఎస్ బిజెపిలో మధ్య ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతుంది.
ఇలా ఎన్నో అంశాలు తెలంగాణ బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.ఆ పార్టీపై అనుమానాలు పెరిగాయి.
ఆ ప్రభావం ఇప్పుడు పార్టీ నుంచి వలసలు మొదలవడానికి కారణంగా తెలుస్తుంది.