అప్పుడప్పుడు మనం హడావుడిగా ఉన్నప్పుడు వంటిట్లో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం.అదే కాఫీలో చెక్కెర అనుకుని, ఉప్పు వేయడం లేదా కూరల్లో ఉప్పు అనుకుని చెక్కెర వేయడం వంటివి చేస్తుంటాం.
అది కూరల్లో మట్టుకు జరుగుతుంది.కానీ, అవయవాలపై ఇలాంటి పొరపాట్లు జరిగితే వాటి పరిస్థితి ఏంటి? ఇలాంటి విచిత్ర ఘటన యూనైటెడ్ కింగ్‌డమ్‌లో జరిగింది.కంటి చుక్కల మందు అనుకుని జిగురు పోసుకుంది ఓ మహిళ.ఇది యూకేలో చోటుచేసుకుంది.నిజానికి ఆమె ఐ డ్రాప్స్ కోసమే వెతికింది.కానీ, జిగురు పోసుకుంది.
దీంతో ఆమె రెండు కళ్లు పూర్తిగా మూసుకుపోయాయి.
అసలు విషయం ఏం జరిగిందంటే.
కేట్ అనే మహిళ దాదాపు ఓ 35 ఏళ్లుంటాయి.ఆమెకు జ్వరం వచ్చింది.
దీంతో ఆమె ఇంట్లోనే ఉండిపోయింది.అయితే , ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె కళ్లు కూడా మంటలుగా అనిపించాయి.
దీంతో ఆమె ఐ డ్రాప్స్ కోసం ఇళ్లంతా వెతికింది.అప్పుడు ఓ డబ్బా కనబడగానే వెంటనే తీసి కంట్లో వేసుకుంది.
నిజానికి ఆమె పోసుకుంది జిగురు.ఆమె విషయం గ్రహించే సమయానికి జరగాల్సింది జరిగిపోయింది.
కేట్ కళ్లు పూర్తిగా మూసుకుపోయాయి.వెంటనే కళ్లలో నీరు పోసుకుని కడిగినా.
ఫలితం లేకపోయింది.

అప్పుడు కేట్ వెంటనే పక్కింటి వారి సాయంతో ఆస్పత్రిలో చేరింది.ఆమెకు సర్జరీ చేస్తే కాని పరిస్థితి తెలియదని డాక్టర్లు చెబుతున్నారు.గత సంవత్సరం కూడా ఇలాంటి ఘటనే జరిగింది.
ఓ మహిళ తలకు పెట్టుకునే నూనె అనుకొని జిగురును తలపై పోసుకుంది.
ఇంకేముంది.
జుట్టంతా పుర్రెకు అంటుకుపోయింది.వైద్యులు శస్త్ర చికిత్స చేసి మరీ ఆమెను కాపాడారు.
ఇంకో మహిది కూడా దాదాపు ఇదే పరిస్థితి తన వాలెట్‌లో ఐ డ్రాప్స్ పెట్టుకుని ఉండేది.ఓ రోజు ఆఫీసుకు వెళ్లే హడావుడిలో ఆమె పర్స్‌లో నుంచి తీసి నెయిల్‌ను జాయింట్ చేసే జిగురును, ఐ డ్రాప్స్ అనుకుని తీసి కంట్లో వేసేసుకుంది.

ఇక ఈమె కూడా డాక్టర్ల వద్దకు లబోదిబోమంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.వైద్యులు దాదాపు ఐదు గంటలపాటు శ్రమించి శస్త్ర చికిత్స చేసి రెండు రెప్పలను విడదీశారు.లక్కీగా ఆమెకు కాంటాక్ట్ లెన్స్ ఉన్నాయి.అవే ఆమె చూపు కోల్పోకుండా చే శాయట.ఇక తాజాగా జరిగిన కేట్ విషయానికి వస్తే.ఆమె పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉంది.
అదేదో సామెతాలా మామూలు జ్వరంతో పోయేది.ఇలా శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి దుస్థిత ఏర్పడింది.
ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఎలాంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది.