టన్ ప్రభుత్వం వీసా జారీ విధానంపై నూతన ప్రణాలికలు అమలు చేయనుంది.ఈ రకమైన విధానం ఇప్పటివరకూ ఎక్కడా లేకపోవడం విశేషమని అంటున్నారు బ్రిటన్ అధికారులు వీసా జారీ సమయంలో బ్రిటన్ ప్రభుత్వం సరికొత్త ప్రణాలికలు రచిస్తోంది.
వచ్చే ఏడాది మార్చి నుంచి బ్రిటన్ తన స్వేచ్ఛా విధానాలను అమలుపరచనుంది.బ్రెగ్జిట్ తర్వాత సరికొత్త ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అమలుచేస్తామని తెలిపారు అయితే…
అత్యుత్తమ నైపుణ్యం కలిగిన విదేశీయులకు కల్పిస్తున్న వీసాల జారీకి వేతన పరిమితిని విధించనున్నామని బ్రిటన్ మంత్రి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇదే విషయాన్ని ప్రధాని థెరిసా మే కూడా గతంలోనే పేర్కొన్నారు…అందుకు గల కారణాలని విసదీకరిస్తూ అధిక నైపుణ్యం కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె అన్నారు.
అయితే యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన పౌరులను కూడా విదేశీయులుగా పరిగణించనున్నామని ముందుగానే ఆమె స్పష్టం చేశారు.“వీసా” జారీకి వేతన పరిమితి విధించనున్నామని అయితే ఈ పరిమితి ఎంత ఉంటుందనే విషయం ఇప్పటిలో చెప్పలేమని తెలిపారు.అయితే పూర్తి స్థాయిలో పరిశీలనా అయిన తరువాత ఈ విషయంపై ఒక నిర్ణయానికి వస్తామని అధికారులు తెలిపారు.