ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి ఎంతో ఆసక్తికరంగా మారుతున్నాయి.సినిమాల్లో సస్పెన్స్ సీన్స్ లా ఏపీ రాజకీయాలు ఎంతో సస్పెన్స్ రేకెత్తిస్తున్నాయి.
అసలు ఏపీలో ఏమి జరుగుతోంది ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు.భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవబోతున్నాయి ఏపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి ,మంత్రులు ,ఎమ్మెల్యేలు ఇలా ప్రతీ ఒక్కరిపై బీజేపీ పాయింట్ బ్లాక్ లో గురిపెట్టి ఉంచిందా అవినీతి పేరుతో దాడులు చేయించడానికి సిద్దంగా ఉందా.? అనే విషయాలు సామాన్యులని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.అసలు విషయంలోకి వెళ్తే.
వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు కంటే కూడా బాబు తనయుడు లోకేష్ పై ప్రధానంగా దృష్టి పెట్టిందనే అర్థమవుతోంది.ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు నిదర్సనంగా కనిపిస్తున్నాయి…తాజాగా బీజేపీ నేత జీవీఎల్ కూడా దానినే స్పష్టం చేసేశారు…అతి త్వరలో లోకేష్ విషయంలో బీజేపీ కోర్టు ద్వారా ముందుకు వెళ్లనుందని మంత్రిత్వ శాఖ వ్యవహారాలపై కోర్ట్ ని ఆశ్రయించబోతున్నట్టు వెల్లడించారు.దాంతో ఆపరేషన్ నారా లోకేష్ సాగుతున్నట్టుగా టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉంటే ఒక వైపు ఓటుకు నోటు కేసులో ఆ 50లక్షల రూపాయల వివరాలు సేకరించి ఆ పై చంద్రబాబు కి నోటీసుకు ఇచ్చి ఏపీ టీడీపీ లో అలజడి రేపడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని అయితే ఈ క్రమంలోనే లోకేష్ ని కూడా ఇరికిస్తే తెలుగుదేశం పార్టీ పై తీవ్రమైన ప్రభావం పడటమే కాకుండా ఏపీలో టీడీపీ పై నమ్మకం కూడా పోతుందని అంచనాలు వేస్తున్నారట.
తద్వారా బాబు ని లోకేష్ ని చిక్కుల్లో పడేయాలనేది బీజేపీ వ్యూహంగా అర్థమవుతోంది.
వాస్తవానికి ఐటీ శాఖలో షెల్ కంపెనీల ద్వారా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఇటీవల శ్రవణ్ కుమార్ అనే మాజీ న్యాయమూర్తి హైకోర్ట్ లో పిల్ వేయడం.తగిన ఆధారాలు లేకపోవడంతో కోర్ట్ రిజక్ట్ చేయడం అందరికి తెలిసిందే అయితే ఈ విషయంపై సమాచారం ఇవ్వడానికి ప్రభుత్వం ఏ విధంగా కూడా సహకరించని కారణంగా కోర్టుల ద్వారా తేల్చుకుంటే ఏపీ ప్రజలకి కూడా అసలు విషయం తెలుస్తోందని బీజేపీ నేత జీవీఎల్ సైతం వ్యాఖ్యానించడం టార్గెట్ లోకేష్ అనే వ్యాఖ్యలని బలపరుస్తోంది.అయితే పక్కా సాక్ష్యాధారాలతో లోకేష్ చుట్టూ ఉచ్చి బిగించాలని ఇప్పటికే బీజీపే నేతలు డిసైడ్ అయ్యారట…దాంతో లోకేష్ జైలుకెళ్ళడం ఖాయం అంటూ వార్తలు హల చల్ చేస్తున్నాయి అయితే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల్లో ఇదే అతిపెద్ద హాట్ టాపిక్ అవుతోంది.