కరవమంటే కప్పకు కోపం .విడవమంటే పాముకి కోపం అన్నట్టుగా తయారయ్యింది టీఆర్ఎస్ పార్టీలోని నాయకులు.
అధినాయకుల పరిస్థితి.ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కార్ ని టాప్ గేర్ లో వేసి దూసుకుపోవాలని కేసీఆర్ భావిస్తుంటే … పార్టీలో ఉన్న అసమ్మతి నాయకులు అడుగడుగునా స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుతగులుతున్నారు.
పోనీ వారిని బుజ్జగించి.భయపెట్టి ఏదోలా దారిలోకి తెచ్చుకుందామని ప్రయత్నిస్తున్నా వారు మాత్రం తమ పంతం వీడేందుకు ఇష్టపడడంలేదు.

ఇప్పటికే 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయించిన తెరాసకు రెబెల్స్ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్వయంగా మాట్లాడి వాళ్ళను చల్లబరచడానికి ప్రయత్నిస్తున్నా పెద్దగా ఉపయోగం కనపడటం లేదు.ఎన్నిరకాలుగా చెప్పినా సరే అసంతృప్తులు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించకపోవడంతో టీఆర్ఎస్ అగ్రనాయకులు ఆలోచనలో పడ్డారు.
అందరికీ న్యాయం చేస్తాం.
కానీ అభ్యర్థులను మార్చే ప్రసక్తి ఉండదు.దయచేసి అందరూ సర్దుకొండి.
పార్టీని గెలిపించాలని మంత్రి కేటీఆర్ రెబల్ అభ్యర్థులతో స్వయంగా మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు.అనుభవించిన వారు అలాగే చెప్తారు.
కష్టపడ్డవాళ్లకు టీఆర్ఎస్ లో గుర్తింపు లేదంటూ వారు ఎదురు వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీ నిర్ణయం మాత్రం ఒక్కసారి చెప్పిచూద్దాం.పరిస్థితి చూశాక వినకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని భావిస్తున్నారట.దీనిప్రకారం దాదాపుగా 50 నియోజకవర్గాలలో తెరాస రెబెల్స్ పై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదే కనుక జరిగితే వారు ఊరుకుంటారా టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా తమ గళం పెంచి రచ్చ రచ్చ చేసేస్తారు కదా ! ఏమైనా ఇలాంటి పరిస్థితులు ఏ పార్టీకైనా ఇబ్బందికరమే.







