భారతీయుల ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు ముఖ్యంగా భారతీయల కంటేకూడా విదేశీయులకి భారతీయుల సత్తా గురించి బాగా తెలుసనే చెప్పాలి ఎందుకంటే.దేశ విదేశాలలో నివసిస్తూ అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న ఎంతో మంది భారతీయులు అక్కడే అనేకరంగాలలో ఉన్నతమైన ప్రతిభ కనబరుస్తూ అక్కడి స్థానికుల కంటే కూడా ముందు నిలుస్తూ ఉంటారు అలాంటి సందర్భమే ఒకటి జరిగింది అదేంటంటే
ప్రపంచంలోనే టాప్ 10 స్కాలర్‌షిప్స్‌లో ఒకటైన “డేవిడ్సన్ ఫెలోస్ స్కాలర్‌షిప్స్” కు ఏకంగా ఆరుగురు భారతీయ అమెరికన్ టీనేజర్లు ఎంపికయ్యారు…ఈ వార్త అమెరికా విద్యారంగంలో సంచలనం అమెరికా మొత్తం మీద 20 విద్యార్థులను ఎంపిక చేయగా అందులో ఆరుగురు భారతీయ అమెరికన్లు ఉండడం ఎంతో విశేషం.సైన్స్, మాథ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, సంగీతం, సాహిత్యం, ఫిలాసఫీతోపాటు ఇతర రంగాలలో పరిశోధనలకుగానూ ఈ స్కాలర్‌షిప్‌ను అందజేస్తారు.
అయితే ఈ స్కాలర్ కోసం విద్యార్ధుల వయస్సు 18 సంవత్సరాలకు మించకూడదు.ఈ ఏడాది ఎంపికైన భారతీయ అమెరికన్లలో ఇద్దరికి 50 వేల డాలర్లు, మరో నలుగురికి 25 వేల డాలర్ల చొప్పున వ్యక్తిగతంగా దక్కనున్నాయి.దీంతో భారతీయ అమెరికన్ల ప్రతిభకు ఇది మరొక నిదర్శనమని భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.