దెయ్యం రూపంలో వచ్చిన బామ్మ.. హాయ్ చెప్పి నవ్విన చిన్నారి

దెయ్యం పేరు చెప్తేనే చిన్నారులు పక్క తడుపుకుంటారు.కొంత మంది పెద్దవాళ్లలోనూ దెయ్యం అంటే చాలా భయం ఉంటుంది.

 Two Years Boy Waves And Greets Ghost While In Bed With His Father In Scotland De-TeluguStop.com

రాత్రి పడితే చాలు బయటకు రావడానికి కూడా కొందరు భయపడుతుంటారు.మరికొంత మందికి అంతలా భయం లేకున్నా కొన్ని సంఘటనలు ఎదురైనప్పుడు ఒళ్లు జలదరిస్తుంది.

అకస్మాత్తుగా ఇంట్లో తలుపులు గాలికి టపాటపా కొట్టుకుంటున్నా, కర్టెన్ గాలికి ఎగురుతున్నా మనసులో ఏదో మూల దెయ్యం గురించిన ఆందోళన ఉంటుంది.అలాంటిది ఇంట్లోనే ఆత్మరూపంలో తిరుగుతున్నారని అనిపిస్తే గుండె జారిపోతుంది.

కొందరు దెయ్యాలు లేవని కొట్టిపారేసినా ప్రజల్లో భయం అలాగే ఉంటోంది.

స్కాట్లాండ్‌లో ఇటీవల ఓ తండ్రికి ఊహించని అనుభవం ఎదురైంది.

తనతో బెడ్‌పై పడుకుని ఆడుకుంటున్న తన రెండేళ్ల కుమారుడు ఎవరినో చూసినట్లు గాలిలో చేతులు ఊపాడు.హాయ్ చెప్పి నవ్వాడు.

ఆ తర్వాత కితకితలు పెట్టినట్లు ఫీల్ అయి పకపకా నవ్వాడు.చివరికి బాధగా చేతులు ఊపుతూ ‘బై’ చెప్పాడు.

ఇదంతా చూస్తున్న బాలుడి తండ్రి నిశ్చేష్టుడయ్యాడు.ఎవరికి హాయ్ చెప్పావని పదేపదే తన కొడుకును అడిగాడు.

చివరికి కనిపించింది ఎవరో అర్థం చేసుకున్నాడు.దీంతో బాలుడి తండ్రి షాక్ తిన్నాడు.

ఎందుకంటే అతడి తల్లి, బాలుడి నానమ్మతోనే ఆ చిన్నారి అలా ఆడుకునే వాడు.

ఇంకెవరికీ అలా స్పందించే వాడు కాదు.

దీంతో తన తల్లే ఆత్మ రూపంలో అక్కడే తిరుగుతున్నట్లు తెలుసుకున్నాడు.

Telugu Devil, Scotland, Toddler, Boy, Latest, Greets Ghost-Latest News - Telugu

ఆమె కేన్సర్ బారిన పడి ఇటీవలే కన్నుమూసింది.బ్రతికుండగా తన మనవడితో బాగా ఆడుకునేది.దీనిని అర్థం చేసుకున్న బాలుడి తండ్రి కళ్లు చెమర్చాయి.

భారతదేశంలో చనిపోయిన తమ వారి ఆత్మలు పైలోకాలకు వెళ్లేందుకు కర్మకాండలు నిర్వహిస్తారు.చనిపోయిన తమ వారికి కర్మకాండల సమయంలో పిండ ప్రదానం చేస్తారు.

కాకుల రూపంలో వచ్చి వారు ఆ పిండాలను తింటారని మన సంప్రదాయంలో ప్రజల విశ్వాసం.అయితే విదేశీయులెవరూ ఈ ఆచారాలను పాటించరు.

అయితే దేశ విదేశాలలో మాత్రం చనిపోయిన తమ వారు తమతోనే ఉంటారని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube