సోషల్ మీడియా యాప్ దిగ్గజాలు ఎప్పటికప్పుడు నయా ఫీచర్లను అందిస్తూ.యూజర్లను ఆకట్టుకుంటుంటాయి.
ఎందుకంటే వారికి కొత్తదనం అందిస్తినే వాటికి వినియోగదారులు పెరుగుతారు.తద్వారా ఇతర పోటీ యాప్లకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.
ఈ బాటలోనే ప్రస్తుతం ట్వీటర్ నడుస్తోంది.ఆ మధ్య కొన్ని వివాదాల్లో చిక్కుకున్న ట్వీటర్ సరికొత్త ఫీచర్లను తమ వినియోగదారుల కోసం పరీక్షిస్తోంది.
,/br>
ఈ నేపథ్యంలో ప్రముఖ మైక్రోబ్లాగింగ్ యాప్ ట్వీటర్ ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది.ఇకపై వాయిస్ ట్వీట్స్‌కు క్యాప్షన్స్‌ను ఇవ్వనుంది.
దీన్ని గత ఏడాది 2020 జూన్‌లోనే ప్రకటించింది.ప్రస్తుతం ఈ ఫీచర్‌ను తమ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంచనుంది.ఆ వివరాలు తెలుసుకుందాం.ఇదివరకు ఆటోమేటెడ్ క్యాప్షన్స్ ఫీచర్ ట్వీటర్‌లో లేదని దీన్ని వాడుతున్న అడ్వొకేట్స్ చాలా మంది విమర్శించారు.దీంతో ఇకపై ఏ వాయిస్ ట్వీట్లకైనా క్యాప్షన్స్ రూపంలో కనిపించే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

ఆటోమేటెడ్ క్యాప్షన్లు వివిధ భాషల్లో అందుబాటులో ఉంది.ఇంగ్లిష్, జపానీస్, స్పానిష్, పోర్చుగీస్, తుర్కిష్, అరబిక్, ఫ్రెంచ్, హింది, ఇండోనేషియా, కొరియన్, ఇటాలియన్ వంటి భాషల్లో ఉండనున్నాయి.ట్వీటర్ అన్ని భాషల్లోని వారికి అందుబాటులో ఉండాలని ఈ ప్రయోగం చేసింది.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కేవలం ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంచామని ట్వీటర్ అధినేత గురుప్రీత్ కౌర్ తెలిపారు.ప్రస్తుతం ఈ ఫీచర్ యాక్సెసెబిలిటీ మరింత మెరుగుపరచడానికి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో తీసుకురానున్నట్లు తెలిపారు.ట్వీటర్ క్యాప్షన్స్ చూడాలనుకునే వినియోగదారులు ట్వీటర్ యాప్‌లోని కుడివైపు పైభాగంలో ఉండే మూడు చుక్కల్లో సీసీ బటన్‌పై ట్యాప్ చేయాల్సి ఉంటుందన్నారు.
ఈ సరికొత్త క్యాప్షన్స్ ఫీచర్ కేవలం కొత్త రాబోయే ట్వీట్లను మాత్రమే చూపిస్తుంది.అంటే పాత ట్వీట్లకు క్యాప్షన్స్ చూపించబోదు.
అంతేకాదు ట్వీటర్ ఇకపై అన్ని తన స్పేసెస్‌లోనూ ఈ క్యాప్షన్స్ ఫీచర్‌ను అందించనుంది.