బాల్యంలోనే తల్లి తండ్రులతో అమెరికా వచ్చి స్థిరపడిన వారు ఇకపై అమెరికాలో ఉండేందుకు వీలు లేదని, వారికి ఎన్నో ఏళ్ళుగా రక్షణగా ఉంటున్న డాకా చట్టం చెల్లదని అమెరికా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.డ్రీమర్స్ కు మేలు జరగాలని బిడెన్ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.
తాజాగా ఇచ్చిన ఈ తీర్పుతో దాదాపు 6 లక్షల మంది డ్రీమర్స్ ఆందోళనలో ఉన్నారు.అసలు ఈ డాకా చట్టం ఏంటి ఎందుకు ఈ చట్టంపై అమెరికా కోర్టు గుర్రుగా ఉంది అనే వివరాలలోకి వెళ్తే.
డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్ (డిఏసిఏ).ఒబామా హాయంలో వలస వాసుల పిల్లల రక్షణ కోసం తీసుకువచ్చిన ఈ చట్టం ఎంతో మంది ప్రవాసుల పిల్లలకు ఎన్నో ఏళ్ళుగా రక్షణగా నిలిస్తోంది.
ముఖ్యంగా ఎంతో భారత విద్యార్ధులకు ఈ చట్టం ఓ వరమనే చెప్పాలి.ఒబామా హాయంలో ఎంతో మంది వలస వాసుల విజ్ఞప్తి మేరకు, వారి పిల్లలను అమెరికా నుంచీ పంపే వీలు లేకుండా రక్షణగా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు.
అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ డాకా చట్టాన్ని రద్దు చేశారు.

అయితే డాకా చట్టం ఎంతో మంది వలస వాసుల పిల్లలకు రక్షణగా ఉంటుందని కోర్టులో వాదనలు వినిపించడంతో ట్రంప్ కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.ఈ చట్టాన్ని కాదనే హక్కు లేదని అమలు చేయాల్సిందే నని తీర్పు చెప్పడంతో డ్రీమర్స్ ఊపిరి పీల్చుకున్నారు.కానీ బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ చట్టాన్ని వ్యతిరేకించే వారు మళ్ళీ కోర్టును ఆశ్రయించారు.
దాంతో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన టెక్సాస్ న్యాయమూర్తి ఈ చట్టం చట్ట విరుద్దమని ఇకపై ఈ డ్రీమర్స్ నుంచీ వచ్చే దరఖాస్తులు తీసుకోవద్దని, కానీ గతంలో తీసుకున్న దరఖాస్తులు పరిగణలోకి తీసుకోవాలని తీర్పు చెప్పారు.దాంతో లక్షలాది డ్రీమర్స్ పరిస్థితి ఆందోళనలో ఉంది.
మరి బిడెన్ ఈ తీర్పును చాలెంజ్ చేస్తారో లేదా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.