హెయిర్ విపరీతంగా ఊడిపోతుందా.? రోజురోజుకు జుట్టు పల్చగా( Thin Hair ) మారుతుందా.? ఎన్ని రకాలుగా ప్రయత్నించిన జుట్టు సరిగ్గా ఎదగడం లేదా.? అయితే అస్సలు చింతించకండి.కేశ సంబంధిత సమస్యలను పరిష్కరించే ఔషధాలు మన వంటింట్లోనే ఉన్నాయి.ముఖ్యంగా జుట్టు రాలే సమస్యను దూరం చేయడంలో మరియు కురులు దట్టంగా పెరిగేలా ప్రోత్సహించడంలో ఇప్పుడు చెప్పబోయే హెయిర్ మాస్క్ చాలా బాగా సహాయపడుతుంది.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులను వాటర్ తో సహా వేసుకోవాలి.
అలాగే ఒక అరటి పండును( Banana ) స్లైసెస్ గా కట్ చేసి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మెంతులు అరటిపండు మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ హనీ మరియు వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి బాగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ మెంతులు అరటిపండు మాస్క్ ను కనుక వేసుకున్నారంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా ఈ మాస్క్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

అదే సమయంలో కొత్త జుట్టు ఎదుగుదలను ఈ హెయిర్ మాస్క్ ప్రోత్సహిస్తుంది.జుట్టును కొద్ది రోజుల్లోనే దట్టంగా మారుస్తుంది.అంతేకాకుండా పొడి జుట్టును రిపేర్ చేయడంలో, హెయిర్ డ్యామేజ్ ను కంట్రోల్ చేయడంలో కూడా ఈ మాస్క్ సహాయపడుతుంది.
కాబట్టి జుట్టును దట్టంగా ఆరోగ్యంగా మార్చుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ హెయిర్ మాస్క్ ను ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.