అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి స్థానిక ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి అమత్ మెహతా కీలక ఆదేశాలు జారీ చేశారు.ట్రంప్ అధికారాన్ని చేపట్టక ముందు నుంచీ 8 సంవత్సరాల వరకూ గల తన ఎకౌంటు వివరాలని ఇవ్వాలని డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జ్ ఆదేశించారు.
ఈ మేరకు ట్రంప్ తరుపున ఎకౌంట్ చూసుకునే మాజర్స్ యూఎస్ఏ ఎల్ ఎల్ పీని ఆదేశించారు.ఇదిలాఉంటే
తమకి ట్రంప్ కి సంభందించిన 8 సంవత్సరాల ఫైనాన్సియల్ రిపోర్ట్ ని ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రతినిధుల సభకి చెందిన హౌస్ ఓవర్ సైట్ and రిఫార్మ్స్ కమిటీ డిమాండ్ ని సవాలు చేస్తూ ట్రంప్ తరుపు న్యాయవాదులు చేసిన ఫిర్యాదులని పరిశీలించిన న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
అయితే ఆర్ధిక పరిశీలనకి సంభందించి కాంగ్రెస్ అధికారాలు పరిమితిగా ఉంటాయని చట్ట ప్రకారం విచారణ జరిగేంత వరకూ కూడా ఈ పరిమితులు కాంగ్రెస్ విచారణని సైతం అడ్డుకోలేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ఈ పరిణామాలతో కాంగ్రెస్ కి రికార్డ్ లు మాజర్స్ ఇవ్వకుండా ట్రంప్ అడ్డుకోలేరని న్యాయమూర్తి స్పష్టం చేశారు.న్యాయమూర్తి ఇచ్చిన ఈ తీర్పుపై మాజర్స్ కి చెందిన ఓ ప్రతినిధి స్పందిస్తూ చట్టప్రకారం మేము నడుచుకుంటామని, ఎటువంటి ఆదేశాలు కోర్టు ఇచ్చినా గౌరవించి సహకరిస్తామని తెలిపారు.