రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్ధి అయిన జో బిడెన్ పై ట్రంప్ కుట్ర పన్నుతూ విదేశీ శక్తుల సాయం కోరడంపై అభిశంసన పెట్టాలని డెమోక్రటిక్ పార్టీ నేతలు, ప్రతినిధుల సభలో స్పీకర్ నాన్సీ ఫెలోసీకి అభ్యర్ధన పెట్టడం ఆమె అందుకు అంగీకరిస్తూ విచారణకి ఆదేశించడం అందరికి తెలిసిందే.అయితే ఉక్రెయిన్ గేట్ లో ట్రంప్ పై అభిశంసన విచారణ ప్రారంభం అవుతున్న క్రమంలో.
ట్రంప్ ప్రతినిధుల సభ స్పీకర్ పై ఎదురు దాడి చేశారు.నాన్సీ తనపై అసత్య ఆరోపణలకి గాను అభిశంసన పెట్టిందని ఈ నేరం ఋజువు కాదని, చివరికి నాన్సీ దోషిగా తేలుతుందని అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష బరిలో నిలిచిన నేత జో బిడెన్ మాట్లాడుతూ.ట్రంప్ నన్ను నిలువరించడానికి చేసే ఏ ప్రయత్నమైనా సఫలం కాదని అన్నారు.

ఇదిలాఉంటే ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.దేశంలో పేరుకుపోయిన అవినీతిని నిలువరించడానికి విదేశీ శక్తుల సాయం అయినా నేను తీసుకుంటానని అన్నారు.అందులో తప్పులేదని సమర్ధించుకుంటున్నారు.అమెరికా అధ్యక్షుడిగా అది తన భాద్యత అంటూ పేర్కొన్నారు.మొత్తానికి ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారే అవకాశం లేకపోలేదు అంటున్నారు పరిశీలకులు.
.