అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొంతకాలంగా అమెరికా ప్రభుత్వ కీలక పదవుల్లో భారత సంతతి వ్యక్తులని నియమిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.తాజాగా ట్రంప్ ముగ్గురు భారత సంతతి వ్యక్తులని అమెరికాలో అత్యంత కీలక పదవుల్లో నియమిస్తూ ఉత్తరువులు జారీ చేశారు.వారిలో “రీటా బరన్‌వాల్” , “ఆదిత్య బంజాయ్” , “బిమల్ పటేల్” ఈ ముగ్గురు భారత సంతతి వ్యక్తులు కావడం గమనార్హం అయితే
రీటా బరన్‌వాల్ కు ఇంధనశాఖ అణుశక్తి విభాగం అసిస్టెంట్ సెక్రెటరీగా కీలక భాద్యతలు అప్పగించగా , ఆదిత్య బంజాయ్‌ని పౌరహక్కుల బోర్డు సభ్యునిగా నియమించారు.ఇక బిమల్ పటేల్ ను ఆర్థికశాఖ అసిస్టెంట్ సెక్రెటరీగా నామినేట్ చేశారు.ఈ ముగ్గురు నామినేషన్లని కాంగ్రెస్ ఆమోదం కోసం పంపడం జరిగిందని అధికారులు తెలిపారు.
ట్రంప్ ఇప్పటి వరకూ తన ప్రభుత్వంలో దాదాపు 30 మందికి పైగానే భారత సంతతి వ్యక్తులని కీలక పదవుల్లో నియమించడం జరిగింది.అయితే అమెరికాలో భారత సంతతి వ్యక్తుల ఓట్లు అత్యంత కీలకం కావడం , అన్నిటికంటే కూడా భారతీయులకి ఉన్న అపారమైన తెలివితేటలు భారతీయులని కీలక పదవులు అలంకరిస్తున్నాయి.
తాజా వార్తలు