అమెరికాలో ఎంతో మంది విదేశీయులు ఉన్నతమైన జీవితం కోసం, అధిక డబ్బు సంపాదన కోసం వలసలు వెళ్లి అక్కడ అధిక వేతనాలతో ఎంతో స్థిరమైన జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు.అయితే ఇలాంటి వారు చాలా మంది అక్కడ శ్రమ దోపిడీ కి గురవుతున్నారని, వారు సరైన వాతావారంలో పని చేయలేక పోతున్నారని ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం కలిపించుకుని ఉద్యోగుల విషయంలో కొన్ని సంస్కరణలు చేపట్టాలని ఓ సర్వే తెలిపింది.
హెచ్-1బి వీసాపై పనిచేస్తున్న ఎంతో మంది మనస్పూర్తిగా పని చేయలేక పోతున్నారని , వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారు, ముఖ్యంగా జీతాల పెంపు విషయంలో సంస్కరణలు చేపట్టాలని అమెరికాకి చెందిన సౌత్ ఆసియా సెంటర్ ఆఫ్ ది అట్లాంటిక్ కౌన్సిల్ ఒక నివేదికలో తెలిపింది.అంతేకాదు వారికి హక్కులు కూడా ఇవ్వాలని సూచించింది.అయితే కొన్ని రోజుల క్రితం ట్రంప్ హెచ్-1బి వీసాదారులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని, నైపుణ్యం కలిగిన వారికి పౌరసత్వం ఇస్తామని ప్రకటించిన తరువాత ఈ నివేదిక వెల్లడి కావడం గమనార్హం.
అయితే ప్రస్తుతం ఉన్న వీసా విధానం అమెరికా పౌరులకి మాత్రమే కాకుండా, అక్కడ పని చేస్తున్న ఎన్నారై ఉద్యోగులకి కూడా హాని తలపెట్టేలా ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది.ఒక వేళ పని వాతావారంలో మార్పులు చేయకపోతే ఈ ప్రభావం అమెరికా కంపెనీలపై పడుతుందని.అయితే దీనిని అధిగమించడానికి ప్రభుత్వం వారికి పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని, పని వాతావరణం కలిప్న్చాలని సూచించింది.