అమెరికాలో తెలుగు వ్యక్తికి కీలక భాద్యతలు..

అమెరికాలో ఎన్నో రంగాలలో ఎంతో మంది భారతీయులు ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారు.భారతీయ ప్రతిభ కి ఎల్లలు హద్దు కాదు అంటూ మొదటి సారిగా విదేశాలలో నిరూపించింది మనమే.

 Trump Intends To Appoint Suresh V Garimella To National Science Board-TeluguStop.com

అయితే ఎంతో మంది మేధావులు అమెరికాలోని కీలక విభాగాలలో సైతం అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవులని అలంకరిస్తున్నారు.అయితే తాజాగా అమెరికాలో కీలక విభాగంలో మరొక భారతీయుడు అందులోనూ ఓ తెలుగు వ్యక్తికి ట్రంప్ కీలక భాద్యతలు అప్పగించారు.

అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికన్‌ నేషనల్ సైన్స్ బోర్డ్ సభ్యుడిగా ఇండియన్ అమెరికన్ ప్రొఫెసర్ సురేష్ “గరిమెళ్ల” ను నియమించాలని ట్రంప్ యోచనలో ఉండగానే వైట్ హౌస్ నుంచీ ఆమెరికు ఆయనకీ ఉత్తర్వులు అందినాయని తెలుస్తోంది.

వైట్‌హౌస్ నుంచీ అందిన సమాచారం ప్రకారం మే 10వ తేదీ 2024 వరకు ఆరు సంవత్సరాల పాటు సురేష్ గరిమెళ్ల…జాతీయ సైన్స్ బోర్డు సభ్యునిగా సేవలందిస్తారు.ఈ బోర్డులో ఉండే ఏడుగురు సభ్యుల్లో గరిమెళ్ల ఒకరు.అయితే ఆయన ఈ గుర్తింపు పొందటంతో అమెరికాలో ఉంటున్న తెలుగు వారు అందరూ ఆయనకీ శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube