లోక్‌సభ లో ఆమోదం పొందిన ట్రిపుల్ 'తలాక్' బిల్లు

ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య లోక్‌సభలో ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన ట్రిపుల్ తలాక్ సవరణ బిల్లుకు గురువారం ఆమోదం లభించింది.ఈ బిల్లుకు అనుకూలంగా 245 మంది సభ్యులు ఓటేశారు.

బిల్లు చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి.ఈ బిల్లుకు సవరణలు చేయాలని, జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి.

బిల్లు కోసం ఓటింగ్ నిర్వహించడానికి కొద్ది సేపటి ముందు కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలకు చెందిన ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.అంతకు ముందే దీనికి సంబంధించి సభలో తీవ్ర చర్చ జరిగింది.

ముస్లిం మహిళల సమానత్వానికి ఈ బిల్లు ఉపకరిస్తుందని ఎన్డీయే సర్కారు పేర్కొనగా.ముస్లిం పర్సనల్ లాకు ఈ బిల్లు తూట్లు పొడుస్తుందని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.

20 ముస్లిం దేశాలు ట్రిపుల్ తలాఖ్‌పై నిషేధం విధించగా లేనిది.ఇండియాలో నిషేధిస్తే తప్పేంటని న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ ప్రశ్నించారు.ట్రిపుల్ తలాక్ చట్టంగా మారితే.భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.మగాళ్లకు జైలు శిక్ష పడటం, ఆ మూడేళ్లలో భరణం విషయంలో స్పష్టత లేకపోవడం పట్ల విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ గతంలోనే ఆమోదం తెలిపింది.

కానీ రాజ్యసభలో విపక్షాలు అడ్డుపడ్డాయి.దీంతో ఈ బిల్లును ఆర్డినెన్స్‌గా తీసుకొచ్చిన ప్రభుత్వం కొన్ని మార్పులతో మరోసారి లోక్‌సభ ఆమోదానికి పంపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube