అధిక మైలేజ్ ఇచ్చే బైక్ లలో బెస్ట్ టాప్-3 బైక్స్ ఇవే..!

భారత మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలు నడిపేందుకు ఆసక్తి చూపించడం లేదు.ఎందుకంటే మైలేజ్( Mileage ) కూడా ప్రధాన సమస్యగా మారింది.

 Top 3 Bikes Which Gives More Mileage Tvs Star Sport Bajaj Platina Hero Hf Deluxe-TeluguStop.com

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న పలు బైక్ తయారీ సంస్థలు అధిక మైలేజ్ ఇచ్చే బైక్ లను తయారు చేసి వినియోగదారుల ముందు ఉంచుతున్నారు.పలు కంపెనీలకు చెందిన అధిక మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Tvs star sport:

TVS కంపెనీకి చెందిన అత్యంత మైలేజ్ ఇచ్చే బైక్ లలో TVs Star sport ఉంది.ఈ బైక్ 110cc ఫ్యూయల్ ఇంజిన్ తో ఉంటుంది.

ఈ బైక్ ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.మైలేజ్ విషయానికి వస్తే ఈ బైక్ 75 కిలోమీటర్ల మేర మైలేజ్ ఇస్తుంది.

బైక్ లో ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజన్ టెక్నాలజీని ఉపయోగించారు.ఈ బైక్ ధర విషయానికి వస్తే.రూ.60000 నుంచి రూ.70773 వరకు ఉంటుంది.

Bajaj platina-100:

బజాజ్ కంపెనీకి చెందిన ఈ ప్లాటినా బైక్( Bajaj Platina ) చాలాకాలంగా మార్కెట్ లో ఉంది.ఈ బైక్ 102cc ఇంజిన్ సామర్థ్యం, DTS-i తో వస్తుంది.ఫోర్ స్పీడ్ గేర్ బాక్స్ తో ఉంటుంది.

ఇందులో ఉండే ఫ్యూయల్ ట్యాంక్ లో 11 లీటర్ల మేర పెట్రోల్ నింపవచ్చు.ఈ బైక్ 65 నుంచి 75 కిలోమీటర్ల మేర మైలేజ్ ఇస్తుంది.

ఈ బైక్ ధర విషయానికి వస్తే.రూ.67808 నుంచి ఆరంభం అవుతుంది.

Hero HF DELUXE:

ఈ బైక్ 97.2cc ఇంజిన్ సామర్థ్యం తో 8.05NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.ఏకంగా నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.మైలేజ్ విషయానికి వస్తే 60 నుంచి 65 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.9.5 లీటర్ల ఇంధన ట్యాంకుతో యుఎస్బి చార్జింగ్ సదుపాయం కూడా కలదు.ఈ బైక్ ఎక్స్ షోరూం ధర రూ.70012 గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube