ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి( Dubbing Artist Srinivasa Murthy ) గురించి చెప్పాల్సిన పనిలేదు.1990 కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పని చేయడం మొదలుపెట్టిన శ్రీనివాస్ మూర్తి కొంత కాలంలోనే చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇంత మంచి టాలెంట్ ఉన్న ఈ ఆర్టిస్ట్ 2023, జనవరి నెలలో అకాల మరణం చెందాడు.అతడి మరణాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు.చెన్నైలో గుండెపోటు కారణంగా చనిపోయిన శ్రీనివాస్ బతికున్న సమయంలో 3,000కు పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పి విశేషమైన సేవలను అందించాడు.తెలుగు డబ్బింగ్ సినిమాల్లో సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ వంటి స్టార్ హీరోలకు ఆయన తన అద్భుతమైన వాయిస్ అందించాడు.
ఆయన డబ్బింగ్ వల్ల సినిమాకి ఒక కొత్త కళ వస్తుందని అనడంలో సందేహం లేదు.నిజానికి 12 సినిమాలు ఆయన వాయిస్ వల్ల మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి.అవి ఏవో తెలుసుకుందాం.
• సింగం సినిమాలు

శ్రీనివాసమూర్తి “సింగం” సినిమా( Singam Movie ) సిరీస్‌లో సూర్య పాత్రకు డబ్బింగ్ చెప్పారు.మొత్తం మూడు సింగం సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
• అపరిచితుడు

విక్రమ్ హీరోగా చేసిన అపరిచితుడు మూవీ( Aparichitudu ) ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.మన తెలుగువారు ఈ సినిమా వస్తే ఇప్పటికే టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయి చూస్తారు.ఈ మూవీలో విక్రమ్‌కి శ్రీనివాసమూర్తి అందించిన వాయిస్ అదిరిపోయిందనే చెప్పాలి.
ఇందులో విక్రమ్ మొత్తం మూడు పాత్రలు చేస్తాడు ఆ మూడు పాత్రలకు కూడా ఈ డబ్బింగ్ ఆర్టిస్టే వాయిస్ ఆఫర్ చేశాడు.ఆ వేరియేషన్స్‌కి మనం హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.
• ఐ

డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబినేషన్లో “ఐ” మూవీకి( I Movie ) కూడా శ్రీనివాస్ వాయిస్ అందించాడు ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు.కానీ విక్రమ్ పాత్ర వాయిస్ మాత్రం చాలా మందిని ఆకట్టుకుంది.
• తెగింపు

తమిళ హీరో అజిత్ సినిమాలు చాలానే తెలుగులో డబ్ అయ్యాయి.వాటన్నిటిలో అజిత్ పాత్రలకు శ్రీనివాస్ డబ్బింగ్ చెప్పాడు.తెగింపు మూవీ అతడి డబ్బింగ్ వల్లనే హిట్ అయింది.
• సఖి

మణిరత్నం దర్శకత్వంలో మాధవన్ హీరోగా వచ్చిన మూవీ సఖి.( Sakhi Movie ) ఈ మూవీలో మాధవన్ రోల్‌కు శ్రీనివాస్ డబ్బింగ్ చెప్పాడు.ఆ డబ్బింగ్ చాలా బాగుంటుంది, దానివల్లే సినిమా హిట్ అయింది అని అనేవారు లేకపోలేదు.
• 24

సూర్య నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ “24” కూడా సక్సెస్ అయ్యింది.ఇందులోని సూర్య పాత్రకి వాయిస్ అందించాడు శ్రీనివాస్.
• జనతా గ్యారేజ్

జూ.ఎన్టీఆర్ మూవీ “జనతా గ్యారేజ్”లో( Janatha Garage ) మలయాళ నటుడు మోహన్ లాల్ ఒక కీ రోల్ ప్లే చేశాడు.ఆ పాత్రకి శ్రీనివాస్ డబ్బింగ్ చెప్పాడు.
• అల వైకుంఠపురములో

త్రివిక్రమ్, బన్నీ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో జయరాం క్యారెక్టర్‌కి కూడా శ్రీనివాస్యే వాయిస్ అందించాడు.
• గరుడవేగా

“గరుడ వేగా” మూవీలోని రాజశేఖర్ పాత్రకి కూడా శ్రీనివాస్ గాత్ర దానం చేశాడు.
• ఐరన్ మాన్, జేమ్స్ బాండ్

హాలీవుడ్ సినిమాల తెలుగు వెర్షన్లలోని పాత్రలకు కూడా శ్రీనివాస్ వాయిస్ అందించాడు.ఐరన్ మాన్, జేమ్స్ బాండ్ వంటి సినిమాలు అతడి వాయిస్ వల్లే తెలుగు వారికి బాగా నచ్చేసాయి అనడంలో సందేహం లేదు.
• హనుమాన్

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో వచ్చిన హనుమాన్ మూవీ ట్రైలర్ కి కూడా శ్రీనివాస్ డబ్బింగ్ అందించాడు.