TDP ,Janasena : ఈ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన మధ్య టికెట్ వార్ ? 

టిడిపి, జనసేన( TDP, Jana Sena ) మధ్య అధికారికంగా పొత్తు కొనసాగుతున్నా … ఈ రెండు పార్టీల మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు.బిజెపి కూడా పొత్తు పెట్టుకునే ఆలోచనతో ఉండడంతో వీటికి బ్రేక్ పడింది.

 Ticket War Between Tdp Janasena In This Godavari District-TeluguStop.com

ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల విషయంలో రెండు పార్టీల మధ్య అంతర్గతంగా వార్ నడుస్తోంది.నియోజకవర్గాల్లో మాత్రం జనసేన, టిడిపి అభ్యర్థులు టికెట్ తమకు అంటే తమకు అంటూ ప్రకటించుకుంటూ కొత్త వార్ కు తెర లేపుతున్నారు.

దీంతో ఈ వ్యవహారం రెండు పార్టీల అధిష్ఠానాలకూ తలనొప్పిగా మారింది.ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ఈ తలనొప్పులు మొదలయ్యాయి.

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ( Kothapalli Subbarayadu )జనసేన పార్టీలో చేరబోతున్నారు.ఆయన నరసాపురం ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్నారు.

అయితే ఇప్పటికే జనసేన నరసాపురం జనసేన నియోజకవర్గ ఇన్చార్జిగా బొమ్మిడి నాయకర్ ఉన్నారు.

Telugu Ap, Bommidi Nayakar, Janasena, Janasenani, Pavan Kalyan, Ticketwar, Ysrcp

టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు( MLA Bandaru Madhava Naidu ), ఎన్ఆర్ఐ కావలి నాయుడు, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పొత్తూరు రామరాజు ఇక్కడ టికెట్ ను ఆశిస్తున్నారు.అయితే సుబ్బారాయుడు రాకతో అటు టిడిపి, ఇటు జనసేనలో గందరగోళం నెలకొంది.తాడేపల్లిగూడెం విషయానికొస్తే.

ఇక్కడ టిడిపి జనసేన మధ్య టిక్కెట్ వార్ నడుస్తోంది.ఇక్కడ టిడిపి నేత వలవల బాబ్జి టికెట్ ఆశిస్తూ ఉండగా, జనసేన నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు బొలిశెట్టి శ్రీనివాస్ చెబుతున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.తణుకు టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ( MLA Arumilli Radhakrishna ), జనసేన నియోజకవర్గ ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు మధ్య టికెట్ వార్ నడుస్తోంది.

Telugu Ap, Bommidi Nayakar, Janasena, Janasenani, Pavan Kalyan, Ticketwar, Ysrcp

ఉంగుటూరు అసెంబ్లీ లోను టిడిపి మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, జనసేన ఇన్చార్జ్ ధర్మరాజూ మధ్య టిక్కెట్ వార్ నడుస్తోంది.ఇదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో అటు టిడిపి ఇటు జనసేన తరఫున పోటీ చేసేందుకు కీలక నాయకులే పోటీపడుతుండడంతో, పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఇక్కడ సీట్లు దక్కుతాయనేది ఆయా నియోజకవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.పొత్తులో భాగంగా ఏ పార్టీకి నియోజకవర్గాల్లో టికెట్ కేటాయించినా , మిగతా పార్టీ వారు సహకరించే విధంగా ముందుగానే బుజ్జగింపులకు దిగాలని రెండు పార్టీల అధిష్టానాలు నిర్ణయించుకున్నాయి.మరికొద్ది రోజుల్లోనే టికెట్ల ప్రకటన చేపట్టేందుకు సిద్ధమవుతుండడంతో, ఏ నియోజకవర్గం లో ఏ పార్టీకి టికెట్ దక్కుతుందనేది రెండు పార్టీల నేతలకు టెన్షన్ కలిగిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube