భారతీయ అత్యంత మహిళా ధనవుంతులు వీరే!

అప్పుడెప్పుడో ఓ సినీ కవి ‘లేచింది మహిళాలోకం’ అని గేయాన్ని రచించాడు.అది ఇప్పుడు నిజంగా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.

 Look At Top 5 Richest Women Of India And Their Net Worth, Richest Persons In Ind-TeluguStop.com

ఎందుకంటే, ఇప్పటి వరకు మనం కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుష ధనవంతులు జాబితాలను మాత్రమే చూశాం.కానీ, ఇప్పుడు మహిళల వంతు వచ్చేసింది.

వారి జీవితాల్లో ఎన్నో కష్టాలను దాటుకుని, ఒడిదుడుకలు ఎదుర్కొని నేడు ఈ గొప్పస్థాయికి చేరుకున్నారు.ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో స్థానం దక్కించుకున్నారు.హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2021 నివేదిక విడుదల చేసిన భారత్‌లోని టాప్‌ ఐదు ధనిక మహిళా పారిశ్రామికవేత్తల వివరాలను తెలుసుకుందాం.

కిరణ్‌ మజుందర్‌ షా

బయోకాన్‌ స్థాపకురాలు కిరణ్‌ మజుందర్‌ షా భారతీయ అత్యధిక ధనిక మహిళా వ్యాపారవేత్త.ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు 4.8 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లు.

స్మిత వీ కృష్ణ

Telugu Gupta, Radha Vembu, Richest India, Smitha Krishna-General-Telugu

భారత్‌లో రెండో ధనిక మహిళా పారిశ్రామిక వేత్త గోద్రేజ్‌ అధినేత స్మీత వీ కృష్ణ.ఆమె కుటుంబ ఆస్తుల్లో 1/5 వంతు వాటా కలిగి ఉంది.స్మిత నికర ఆస్తుల విలువ 4.7 బిలియన్‌ డాలర్లు.

మంజూ దేశ్‌బంధు గుప్తా

Telugu Gupta, Radha Vembu, Richest India, Smitha Krishna-General-Telugu

మంజూ దేశ్‌బంధూ గుప్తా, లూపిన్‌ లిమిటెడ్‌ స్థాపకుడైన దేశ్‌బంధు గుప్తా సతీమణి.ఆ కంపెనీకి ఆమె సహవ్యవస్థాపకురాలు కూడా.లూపిన్‌ సంస్థ ఓ బహుళ జాతీయ పార్మాస్యూటికల్‌ కంపెనీ.మంజూ నికర ఆస్తుల విలువ దాదాపు 3.3 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు.

లీనా గాంధీ తివారీ

Telugu Gupta, Radha Vembu, Richest India, Smitha Krishna-General-Telugu

యూఎస్‌వీ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ చైర్‌పర్సన్‌ లీనా గాంధీ తివారీ.ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు 2.1 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లు.ఈ కంపెనీ సాలిడ్‌ ఓరల్‌ బయోసిమిలర్స్, పెపై్టడ్స్, ఆప్తాల్మిక్స్‌ వంటి వస్తువులను తయారు చేస్తుంది.

రాధా వెంబు

Telugu Gupta, Radha Vembu, Richest India, Smitha Krishna-General-Telugu

రాధా వెంబు జోహో కార్పొరేషన్‌లో మెజారిటీ వాటాను కలిగి ఉంది.ఆమె నికర ఆస్తుల విలువ 1.7 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube