ఇది అస్సలు ఊహించలేదుగా ! కేసీఆర్ హ్యాపీనా ?

తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ ( BRS party ) కు గడ్డి పోటీ ఇచ్చే స్థాయిలో తెలంగాణ బిజెపి ( BJP ) బలపడింది.వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తాము అధికారంలోకి వస్తాము అనే ధీమా ఆ పార్టీ రాష్ట్ర నేతలతో పాటు, అగ్ర నేతల్లోనూ కనిపించింది.

 This Is Not Expected At All! Is Kcr Happy? Bjp, Brs, Congress, Telangana Governm-TeluguStop.com

తరచుగా బీజేపీ అగ్ర నేతలు తెలంగాణలో పర్యటిస్తూ బిజెపి కి మరింత ఆదరణ పెంచే విధంగా ప్రయత్నాలు చేశారు దీనికి తగ్గట్లుగానే పార్టీలోనూ చేరికలు చోటు చేసుకున్నాయి.అయితే ఊహించని విధంగా ఈ చేరికల తర్వాత మెల్లిమెల్లిగా పార్టీలో అంతర్గత విభేదాలు, నాయకులు మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యాయి.

ముఖ్యంగా పాత, కొత్త నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉండడం వంటి కారణాలతో తెలంగాణ బిజెపిలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.ఒకప్పుడు కాంగ్రెస్ ఇదే తరహాలో అంతర్గత విభేదాలతో సతమతమవుతూ, రెండు సార్లు పార్టీ ఓటమి చెందింది.

అయితే ఇప్పుడు అదే పరిస్థితి బీజేపీలో చోటు చేసుకోవడం ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు, అగ్ర నాయకుల్లోనూ ఆందోళన పెంచుతుంది.

ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తర్వాత నుంచి తెలంగాణ బిజెపి మరింత బలహీనమైనట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) కు మహా ఆనందాన్ని కలిగిస్తున్నాయి.మొన్నటి వరకు బిజెపితోనే తమకు గట్టి పోటీ ఎదురవుతుందని, కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నే తమ ప్రధాన ప్రత్యర్థి అని ఫిక్స్ అయిపోయారు.

బిజెపిలో చోటుచేసుకున్న అంతర్గత కుమ్ములాటలతో ఈ మధ్యకాలంలో ఆ పార్టీ బలహీనం అయ్యింది.

Telugu Aicc, Bandi Sanjay, Congress, Etela Rajendar, Revanth Reddy, Telangana Bj

ఈ పరిణామాలన్నీ బిజెపి అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా నాయకులంతా ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్లాల్సి ఉన్నా, అంతర్గత కుమ్ములాటలు కారణంగా అనుకున్న లక్ష్యానికి బిజెపి చేరువ కాలేకపోతున్నట్లుగానే పరిస్థితి కనిపిస్తోంది.ముఖ్యంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ,( Etela rajendaR ) మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటివారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని , అలాగే తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించాలని పార్టీ సీనియర్ నాయకులు తరచుగా అధిష్టానం పెద్దల పై ఒత్తిడి చేస్తూ ఉండడం, అలాగే తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే తామే ముఖ్యమంత్రి అవుతామని ప్రకటనలు చేస్తూ ఉండడం, కాంగ్రెస్,బీఆర్ఎస్ లకు దీటుగా బిజెపిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సి ఉన్నా, ఈ విధంగా అంతర్గత కుమ్ములాటలతో  బిజెపి వెనుకబడిపోయినట్లుగానే కనిపిస్తోంది.

Telugu Aicc, Bandi Sanjay, Congress, Etela Rajendar, Revanth Reddy, Telangana Bj

బీఆర్ఎస్ లో అసంతృప్తికి గురై బిజెపిలో చేరేందుకు మొదట ఆసక్తి చూపించిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి కీలక నేతలను బిజెపిలో చేర్చుకునే విషయంలో రాష్ట్ర నాయకులు విఫలం కావడం, వారు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరబోతుండడం వంటి ఘటనలు బిజెపి అధిష్టానం చాలా సీరియస్ గానే ఉంది.ప్రస్తుతం తెలంగాణ బీజేపీ కీలక నాయకులంతా ఢిల్లీలోనే ఉన్నారు.అమిత్ షా వారిని పిలిచే గట్టిగానే క్లాస్ పీకుతున్నట్లు సమాచారం.ఈ విధంగా తమకు ప్రధాన ప్రత్యర్థవుతుందనుకున్న బిజెపి లో చోటు చేసుకున్న ఈ తరహా పరిణామాలు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు మహానందాన్ని కలిగిస్తున్నాయి.

కాంగ్రెస్ తో పోటీ ఉన్నా, ఆ పార్టీలోనూ ఇదే రకమైన పరిస్థితే ఉందనే నమ్మకంతో కేసీఆర్ గెలుపు ధీమాతో ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube