థైరాయిడ్ సమస్య ఉన్నవారు.. ఈ ఆహార పదార్థాలను తింటే బరువు తగ్గుతారా..

సాధారణంగా ఈ మధ్యకాలంలో థైరాయిడ్ సమస్య చాలామంది ప్రజలలో కనిపిస్తూ ఉంది.వైద్యుల అంచనా ప్రకారం భారతదేశంలోనే దాదాపు 42 మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.

 People With Thyroid Problems Will Lose Weight If They Eat These Foods , Thyroid-TeluguStop.com

పురుషుల కంటే స్త్రీలలో థైరాయిడ్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.జీవనశైలి మార్పులు, చెడు ఆహారాలు, శరీరక శ్రమ లేకపోవడం వల్ల థైరాయిడ్ సమస్య ఎక్కువైపోయింది.

కొన్నిసార్లు ఈ సమస్య వంశపారపర్యంగా కూడా వస్తూ ఉంటుంది.శరీర జీవక్రియల్ని నియంత్రించే అతి ముఖ్యమైన గ్రంధి థైరాయిడ్‌ గ్రంధి.

శ్వాస వ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, సంతాన ఉత్పత్తి వ్యవస్థ ఇలా చాలా వాటిపై థైరాయిడ్ హార్మోన్ ఎంతో ప్రభావం చూపుతుంది.థైరాయిడ్ వ్యవస్థలపై మార్పులు రావడం వల్ల థైరాయిడ్ గ్రంధి పనితీరులో మార్పులు వచ్చి హైపర్ థైరాడిజం, హైపోథైరాడిజం వంటి సమస్యలు వస్తున్నాయి.

ముఖ్యంగా చెప్పాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల హైపోథైరాయిడిజం ఉన్నవారు అధిక బరువును నియంత్రనలో ఉంచుకోవచ్చు.

Telugu Brazilianbetel, Eat Foods, Tips, Hyperthyroidism, Hypothyroidism-Telugu H

3

NCBI నివేదిక ప్రకారం నట్స్ బరువు తగ్గడానికి ఎంతగానో సాయపడతాయి.నట్స్ లో సెలినియం, జింక్ పుష్కలంగా ఉంటాయి.T4ని T3 గా మార్చడానికి సెలీనియం ఎంతో అవసరం అవుతుంది.ముఖ్యంగా బ్రెజిలియన్ బీటెల్‌ నట్ లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది.రోజుకు మూడు బ్రెజిలియన్ బీటెల్‌ నట్ లు తీసుకుంటే థైరాడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది.బ్రెజిలియన్ బీటెల్‌ నట్స్ లో మెగ్నీషియం కూడా ఎక్కువగానే ఉంటుంది.ఇవి థైరాయిడ్ గ్రంథి నీ మెరుగ్గా పనిచేసేలా చేస్తాయి.

అంతేకాకుండా బీన్స్, పప్పు దినుసులు కూడా ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడం మంచిది.ఇంకా చెప్పాలంటే తాజా ఆకుకూరలు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఇవి కూడా బరువును అదుపులో ఉంచడానికి ఎంతగానో పనిచేస్తాయి.మరి ముఖ్యంగా చెప్పాలంటే బరువు తగ్గాలనుకునేవారు నీరు ఎక్కువగా త్రాగుతూ ఉండాలి.

అలా చేయడం వల్ల మన శరీరంలోని వ్యర్ధాలు కూడా బయటకు వెళ్లిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube