మీరు పడే కష్టం మీ పిల్లలకి తెలియకుండా పెంచుతున్నారా... అయితే మీరు చేసేది తప్పు... ఎందుకో తెలుసా.

కష్టం…జీవితంలో ప్రతిఒక్కరు కష్టపడుతూనే ఉంటారు.సాఫ్ట్ వెర్ ఉద్యోగిది ఒక కష్టం, కూలి పని చేసేవాడిది మరో కష్టం.కానీ ఒకప్పుడు అసలైన కష్టం అంటే ఏంటో తెలుసా.?

 Things Parents Should Never Tell Their Kids-TeluguStop.com

తినడానికి….సరైన తిండి దొరక్కపోవడం

చదివినా….ఉద్యోగం దొరకకపోవడం

భార్యకి… భర్తపోరు… అత్తపోరు

ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు

ఆరుగాలం కష్టపడిన రైతుకి… పంట చేతికి అందకపోవడం

ఇంటిల్లపాది….ఒక్కరి సంపాదనతో బ్రతకడం💰

చాలీచాలని జీతాలు

ఇలా ఒకస్థాయిలో ఉండేవి.

మిగతావాటికి చాలావరకు సర్దుకుపోయేవారు….

సరిపెట్టుకునేవారు.

కానీ ఇప్పుడు కష్టం అనే రూపురేఖలు మారిపోయాయి.

ఎలాగంటే.?

పరీక్ష తప్పితే కష్టం

అమ్మ తిడితే కష్టం

నాన్న కొడితే కష్టం

పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం

సరైన చీర కొనకపోతే కష్టం…!

ఒక్క మాటలో చెప్పాలంటే…ఇప్పటివారి కష్టాలకి కారణం ఒక్కటే…అనుకున్నది….దొరకాలి .అప్పుడు….కష్టం లేనట్లు

పిన్నీసు దొరక్కపోయినా, ప్రాణం పోయేంత….కష్టం వచ్చినట్లు బాధ పడిపోతున్నారు

అప్పట్లో మనస్సు చాలా బలంగా ఉండేది.ఎందుకంటే చిన్ననాటి నుండి కష్టాలు చూసి పెరిగేవారు.ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలియకుండా….
తల తాకట్టుపెట్టయినా పిల్లలు కోరిందల్లా,వాళ్ళ కాళ్ళ ముందు పెడుతున్నారు తల్లితండ్రులు.

మానసిక బలం తగ్గిపోబట్టి వాళ్ళకిప్పుడు ప్రతీది కష్టమే.

ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు.

అందుకే ప్రస్తుతం తల్లితండ్రులకి చెప్పేది ఏంటంటే

“చదవండి.

చదివించండి.దాంతోపాటే కష్టపడడం నేర్పండి.”మేము పడుతున్న కష్టం చాలు….పిల్లలెందుకు కష్టపడాలి” అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు! మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియజేస్తూ వారిని పెంచండి.

అప్పుడే వారికి కష్టం విలువ తెలుస్తుంది.జీవితంలో వారు స్థాయిలను చేరుకోవడానికి పునాది అవుతుంది.”

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube