మొన్న బ్లూవేల్ ఛాలెంజ్,నిన్న కికి ఛాలెంజ్,డ్రాగన్ భ్రీత్ ఛాలెంజ్.నేడు మోమో ఛాలెంజ్.
సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకొక ఛాలెంజ్ యువతని ఆకర్శిస్తూ కొన్ని, పెడదోవ పట్టిస్తూ ఇంకొన్న,ఆత్మహత్యలకు ప్రేరేపిస్తూ మరికొన్ని.కికి ఛాలెంజ్ గురించి హెచ్చిరస్తూ జాగ్రత్తలు చెప్తున్నారో లేదో మరో ఛాలెంజ్ మార్కెట్లోకి వచ్చేసింది.
అదే మోమో ఛాలెంజ్… ఏంటి ఈ ఛాలెంజ్.దీని వెనుక ఉన్న కారణాలేంటి.

మోమో చాలెంజ్ అంటే?
కికి ఛాలెంజ్ను మించిన మరో ఛాలెంజ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది.దీని పేరు ‘మోమో’.ఈ చాలెంజ్ టీనేజర్లను బలితీసుకుంటోందంటూ ప్రచారం జరుగుతుంది.తాజాగా అర్జెంటీనాలో 12 ఏళ్ల బాలిక ఈ చాలెంజ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.వాట్సాప్‌లో ఇదొక ‘సూసైడ్’ గేమ్.ఇందులో భాగంగా ఓ తల్లి పక్షి ఫొటో వస్తుంది.
దీనిని పంపించి టీనేజర్లకు చాలెంజ్ విసరాలి.అప్పట్లో వైరల్ అయిన ‘బ్లూ వేల్’ చాలెంజ్‌లానే ఇది కూడా అత్యంత ప్రమాదకరమన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
నిజానికి మోమో చాలెంజ్ అనేదే లేదని నిపుణులు అంటున్నారు.అవతలి వ్యక్తి ఫోన్‌లోని సమాచారాన్ని దొంగిలించేందుకే వాటిని పంపుతున్నట్టు చెప్తున్నారు.
ఛాలెంజ్ కాకపోతే మరేంటి?
మోమో అనేది ఓ తల్లిపక్షి బొమ్మ.జపాన్‌కు చెందిన చిత్రకారుడు ఒకరు టోక్యోలోని హర్రర్ ఆర్ట్ వనీలా గ్యాలరీలో ప్రదర్శించారు.
దీనిని కొందరు తప్పుగా వాడుకుంటున్నారు.ఇటువంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది.
వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసేందుకు దీనిని వాడుకుంటున్నారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.వాట్సాప్ ద్వారా ఈ ఫొటో రాగానే భయపడకుండా వచ్చిన నంబరును బ్లాక్ లిస్టులో పెట్టడమే ప్రస్తుతం మన కర్తవ్యం.

ఏదేమైనా బ్లూవేల్ ఛాలెంజ్ తరహాలో ఇది కూడా విజృంబించకముందే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.బ్లూవేల్ బారిన పడి ఎంత మంది చిన్నారులు,యువత తమ ప్రాణాలు కోల్పోయారో తెలిసిందే కదా.
.






