పాము కరిస్తే చర్మం కొవ్వొత్తిలా కరిగిపోతుందంతే..

పాము కరిస్తే చర్మం కరిగిపోతుంది మీరు చదివింది నిజమే.పాము కరిస్తే విషం ఎక్కుతుంది కాని చర్మం కరిగిపోవడం ఏంటి అనుకుంటున్నారా?.అయినా మనిషి చర్మం ఏమన్నా కొవ్వొత్తా కరిగిపోవడానికి అంటారా?? అవును నిజమే ఈ పాము కరిస్తే మనిషి చర్మం కొవ్వొత్తిలానే కరిగిపోతుంది.ఇంతకీ ఆ పాము పేరేంటి,ఏ జాతికి చెందింది,ఎక్కడ ఉంటుంది.

 Most Deadliest Snakes In The World-TeluguStop.com

ఇలా కొన్న ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

· బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఆకర్షణీయంగా కనిపించే ఆ పాము.ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది.ఆ పాము పేరే ‘గోల్డెన్ ల్యాన్స్‌హెడ్’.

గోల్డెన్ ల్యాన్స్ హెడ్ కరిస్తే చర్మం కొవ్వొత్తులా కరిగిపోతుంది.

· బ్రెజిల్‌లోని సావో పౌలో తీరానికి 32 కిమీల దూరంలో ఉన్న ‘స్నేక్ ఐలాండ్‌’లో ఈ సర్పజాతి నివసిస్తోంది.110 చదరపు ఎకరాల విస్తీర్ణంలోని ఈ ద్వీపంలో 4000 పైగానే పాములు నివసిస్తున్నాయి.ఇక్కడ ప్రతి అడుగు విస్తీర్ణంలో ఒక్కో పాము ప్రత్యక్షమవుతుంది.

· గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ విషయం సాధారణ పాము కంటే ఐదు రెట్లు అధికం.11,000 ఏళ్ల కిందట ఈ దీవి బ్రెజిల్‌తో కలిసి ఉండేది.అయితే, సముద్ర మట్టం పెరగడం వల్ల పర్వత ప్రాంతం దీవిగా విడిపోయింది.

· ఈ దీవిలో ప్రపంచంలోని అన్నిరకాల పాములు నివసిస్తున్నాయి.బ్రెజిల్ ప్రభుత్వం ఈ దీవిలోకి సాధారణ ప్రజల ప్రవేశాన్ని నిషేదించింది.కేవలం పరిశోధకులు, నేవీకి మాత్రమే అనుమతి ఉంది.

· ఆ దీవిలోకి ప్రవేశించడం అంత సులభం కాదు.ఎంతో ధైర్యం ఉంటేనే ఈ ద్వీపంలో అడుగుపెట్టాలి.

జారుడు స్వభావం కలిగిన రాళ్ల మీదకు ఎక్కుతూ దీవిలోకి వెళ్లాల్సి ఉంటుంది.

· 1909లో ఇక్కడ ఒక లైట్‌హౌస్ ఏర్పాటు చేశారు.

దీని నిర్వహించే బాధ్యతను ఓ కుటుంబానికి ఇచ్చారు.అయితే, 1920లో దీవిలోని పాములు వారి నివాసంలోకి ప్రవేశించి, వారిని చంపేశాయి.

ఆ తర్వాత కొన్నాళ్లు లైట్‌హౌస్‌ను మూసివేశారు.ఇటీవల అక్కడ ఆటోమెటిక్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

· ఈ దీవి గురించి తెలియని చాలామంది అక్కడికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube