తెలుగు సినిమాల్లో మనకు తెలిసిన విలన్లు వీళ్లే...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది విలన్లు వెండితెర మీద ఒక వెలుగు వెలిగారు…విలనిజనికి పేరు పెట్టింది గా తన నటనతో నటించి మెప్పించిన వాళ్లలో రావు గోపాలరావు ( Rao Gopala Rao )ఒకరు 90 వ దశకం లో పెద్ద హీరోల సినిమాల్లో ఆయనే విలన్ గా చేసేవారు ముఖ్యంగా చిరంజీవి సినిమాల్లో అయితే ఆయనే ఎక్కువ గా విలన్ పాత్రలో నటించేవారు…ఇక ఆయన తర్వాత వచ్చిన వాళ్ల లో రామిరెడ్డి ( Ramireddy )ఒకరు అంకుశం సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయనని అప్పట్లో జనాలు చూస్తేనే తిట్టుకునే వారు…ఆరెంజ్ లో విలనిజం చేసి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

 These Are The Villains We Know In Telugu Movies, Prakash Raj, Telugu Movies, V-TeluguStop.com

ఆయన్ని అమ్మోరు మూవీలో చూసిన తరువాత ఆడవాళ్ళు రామిరెడ్డిని చూస్తేనే భయపడేవారంట.

అంతగా తన నటనతో విలనిజానికి కొత్త అర్థాన్ని ఇచ్చిన నటుడు రామిరెడ్డి.కానీ రియల్ లైఫ్ లో రామిరెడ్డికి చాలా నిర్మలమైన వ్యక్తిగా పేరుంది.

 These Are The Villains We Know In Telugu Movies, Prakash Raj, Telugu Movies, V-TeluguStop.com

తెలుగులోనే కాదు బాలీవుడ్‌ ను ఏలిన యాక్టర్ రామిరెడ్డి.రామిరెడ్డి టాలీవుడ్ లో అంకుశం సినిమా ద్వారా నట జీవితాన్ని మొదలుపెట్టారు.

ఈ మూవీలో ‘స్పాట్‌ పెడుతా’ అనే ఒక్క డైలాగ్‌తో ఆడియెన్స్ భయపడేలా చేశారు.దాంతో ఆయన పేరు అంకుశం రామిరెడ్డిగా మారింది.

అసలు పేరు గంగసాని రామిరెడ్డి, ఆ మూవీ తరువాత వరుసగా అవకాశాలు రావడంతో అప్పట్లో ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించారు.రామి రెడ్డి ఇండియాలోని అన్ని భాషల సినిమాలలో నటించారు.

Telugu Prakash Raj, Jagapathi Babu, Rami, Rao Gopala Rao, Sonu Sood, Telugu, Vil

1959లో జనవరి 1న జన్మించిన రామిరెడ్డి కెరీర్ మొదట్లో సినిమాల వైపు దృష్టి సారించలేదు.జర్నలిస్ట్ కావాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేశారు.అది పూర్తి కాగానే ఒక వార్తాపత్రికలో జర్నలిస్ట్‌గా చేరారు.అందులో భాగంగా సినీ సెలెబ్రెటీల ఇంటర్వ్యూలను రామిరెడ్డి తీసుకునేవారు.ఆ క్రమంలో రామిరెడ్డి ఒకసారి ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ( Director Kodi Ramakrishna ) ఇంటర్వ్యూ కోసం వెళ్లారు.అప్పుడు రామిరెడ్డి ప్రతిభను చూసి ముగ్ధుడైన కోడి రామకృష్ణ తను తీయబోయే సినిమాలో రామిరెడ్డికి విలన్‌ క్యారెక్టర్ ఇచ్చారు.

Telugu Prakash Raj, Jagapathi Babu, Rami, Rao Gopala Rao, Sonu Sood, Telugu, Vil

అలా వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీనే అంకుశం.ఈ మూవీ రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ మూవీనే రామిరెడ్డి కెరీర్‌ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.ఈ మూవినే బాలీవుడ్ లో ప్రతిబంధ్‌ టైటిల్ తో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా రీమేక్‌ చేశారు.

ఆ మూవీలో కూడా విలన్ గా రామిరెడ్డి నటించాడు.అక్కడ ప్రతిబంద్ మూవీ సూపర్‌ హిట్‌ గా నిలిచింది.

ఈ మూవీతో చిరంజీవి కంటే విలన్ గా నటించిన రామిరెడ్డి యాక్టింగ్ బాలీవుడ్‌ ఇండస్ట్రీ ఫిదా అయింది.దాంతో బాలీవుడ్ లో రామిరెడ్డి భారీగా అవకాశాలు వచ్చాయి.90వ దశకంలో, బాలీవుడ్‌లో రామిరెడ్డి పాపులర్ ఫేస్‌గా నిలిచారు.తెలుగు, హిందీలో నటిస్తూనే రామిరెడ్డి ఇతర భాషల్లో కూడా నటించి మెప్పించారు.

అలా ఆయన కెరీర్ మొత్తంలో దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్రిష్ పూరి, ప్రేమ్ చోప్రా, డానీ డెంజోంగ్పా,అమ్జాద్ ఖాన్, గుల్షన్ గ్రోవర్ వంటి విలన్‌లకు ఏ విధంగా తీసిపోని అరుదైన యాక్టర్ అయిన రామిరెడ్డి జీవితం మాత్రం అర్ధాంతరంగా ముగిసిపోయింది.

ఇక వీళ్ళ తర్వాత ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ అయిన నటుడు ప్రకాష్ రాజ్( Actor Prakash Raj ) 2000 సంవత్సరం నుంచి ఒక 20 సంవత్సరాల పాటు ప్రక్ష్ రాజ్ విలన్ గా నటించి మెప్పించాడు ఇప్పటికీ విలన్ గా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు.ఇక వీళ్ళ తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీ లో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో సోను సూద్ లాంటి నటులు కూడా ఉన్నారు నిజానికి ఇప్పుడు మాత్రం జగపతి బాబు విలన్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube