ఐపీఎల్ లో అత్యల్ప బంతుల్లో 100 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే..!

ఈ ఐపీఎల్ సీజన్ -16 లో పాత రికార్డులను బద్దలు కొట్టే పరంపర కొనసాగుతోంది.మ్యాచ్లో గెలవడం లేదా ఓడడం గురించి పక్కన పెడితే, చాలామంది ఆటగాళ్లు అరుదైన కొత్త రికార్డులు నెలకొల్పుతూ చరిత్ర సృష్టిస్తున్నారు.

 These Are The Bowlers Who Took 100 Wickets In The Lowest Balls In Ipl , 100 Wick-TeluguStop.com

తాజాగా పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కగిసో రబడ ఓ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

తాజాగా గుజరాత్ టైటాన్స్ – పంజాబ్ కింగ్స్( Punjab Kings ) మధ్య జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అయితే పంజాబ్ జట్టు ఓడినప్పటికీ పంజాబ్ జట్టులో ఉండే కగిసొ రబడ ఐపీఎల్ లో అత్యల్ప బంతుల్లో 100 వికెట్లు తీసిన డ్వేన్ బ్రావో రికార్డును బ్రేక్ చేశాడు.

ఐపీఎల్ లో అత్యల్ప బంతుల్లో 100 వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

కగిసో రబడ:

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తరపున బౌలింగ్ చేసి 1438 బంతుల్లో 100 వికెట్లు తీసి, అత్యల్ప బంతుల్లో 100 వికెట్లు తీసిన మొదటి బౌలర్ గా ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు.కగిసో రబడ( Kagiso Rabada ) ఈ రికార్డును 64 మ్యాచ్లలోనే సాధించాడు.

డ్వేన్ బ్రావో:

ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున బౌలింగ్ చేసి 1619 బంతుల్లో 100 వికెట్లు తీశాడు.అయితే కగిసో రబడ ఇతనిది కార్డును బ్రేక్ చేయడంతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

లసిత్ మలింగ:

ముంబై ఇండియన్స్ మాజీ పేసర్ 1622 బంతులలో వంద వికెట్లు పడగొట్టాడు.70 మ్యాచ్లలో మలింగ ( Lasith Malinga )ఈ రికార్డును సాధించాడు.

హర్షల్ పటేల్

: భారత్ కు చెందిన ఈ ఆటగాడు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున బౌలింగ్ చేసి 1647 బంతుల్లో 100 వికెట్లు తీసి నాలుగో స్థానంలో నిలిచాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube