స్కూలు పిల్లలకోసం పదివేల లోపు టాబ్లెట్లు తీసుకోవాలనుకుంటున్నారా?

ఈ టెక్నాలజీ కాలంలో చదువుకున్న పిల్లలకు మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ వంటివి అవసరమేనా అంటే అవసరమే అని చెప్పుకోక తప్పదు.ఇపుడు చాలావరకు హోమ్ వర్క్ అనేది ఆన్లైన్ ద్వారానే ఇస్తున్నారు.

 These Are The Best Tabs For School Children Under 10 Thousand Rupees Details, Be-TeluguStop.com

అయితే స్మార్ట్ ఫోన్( Smart Phone ) వలన కొన్ని ఇబ్బందులు తలెత్తక మానవు.ఫోన్ పిల్లల చేతిలో వున్నపుడు ఒక్కోసారి ఇంపార్టెన్స్ కాల్స్ వచ్చినా, ఇంపార్టెంట్ డాటా ఉన్నా వారు తెలియక డిలీట్ చేసే అవకాశం ఉంటుంది.

అలాంటి ఈ తరుణంలో పిల్లల కోసం ప్రత్యేకంగా అతి తక్కువ ధరలో కొన్ని కంపెనీలు ప్రత్యేకమైనటువంటి ట్యాబ్ లైట్లు( Tabs ) రూపొందించాయి.కాబట్టి వాటిగురించి ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం.

Telugu Latest, Lenovo Tab Hd, Panasonic Tab, School Tabs, Tablets, Tcl Tab, Ups-

ఈ లిస్టులో మొదటిది “లెనోవో టాబ్ M10 HD”( Lenovo Tab M10 HD ) ఈ ట్యాబ్ చాలా ఆకర్షణీయంగా ఉండడమే కాగా విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుంది.2 GB RAM మరియు 32GB మెమొరీతో వస్తోంది.ధర విషయానికొస్తే 9999 రూపాయలకు అందుబాటు ధరలో వుంది.ఫీచర్ల విషయానికొస్తే 10.1 సెంటీమీటర్ల స్క్రీన్, 4,850mah బ్యాటరీ సామర్థ్యం, బెస్ట్ కెమెరాతో లభ్యమౌతోంది.ఇక రెండవది “లెనోవో టాబ్ M8 HD”( Lenovo Tab M8 HD ) ఈ టాబ్లెట్ ఓనిక్స్ బ్లాక్ లో 32GB అంతర్గత మెమొరీతో వచ్చింది.

ఇది కేవలం రూ:7,999 ధరలో లభిస్తోంది.

Telugu Latest, Lenovo Tab Hd, Panasonic Tab, School Tabs, Tablets, Tcl Tab, Ups-

ఈ లిస్టులో మూడవది “పానాసోనిక్ ట్యాబ్ 8HD”( Panasonic Tab 8HD ) ఈ కంపెనీ టాబ్లెట్ 32gb ఇంటర్నల్ మెమొరీతో వస్తోంది.అంతేకాకుండా 4g కనెక్షన్, 8 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5100MAH బ్యాటరీ సామర్ధ్యాన్ని కలిగి వుంది.ఇక ధర విషాయానికొస్తే రూ:9,999 ధరలో మీకు దొరుకుతుంది.ఇంకో టాబ్లెట్ గురించి మాట్లాడుకోవాలి.అది “టిసిఎల్ ట్యాబ్”( TCL Tab ) ఈ కంపెనీకి చెందిన ట్యాబ్లెట్ 10.1 IPS డిస్ప్లే, 8000Mah బ్యాటరీ, అన్ని రకాల ఫీచర్లతో కేవలం పదివేలకు లభిస్తోంది.చివరగా మాట్లాడుకోవలసింది “ఆల్కటెల్ టికీ మాక్స్ టాబ్లెట్.” ఈ టాబ్లెట్ 32gb , వైఫై కనెక్టివిటీతో మార్కెట్లో లభ్యమౌతోంది.ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం,10.1 అంగుళాల ఎల్ఈడి స్క్రీన్, మింట్ గ్రీన్ రంగులో లభిస్తోంది.4080Mah బ్యాటరీ, రూ:9,999 ధరలో లభిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube