యాదాద్రి భువనగిరి జిల్లా: తాను పార్టీ మారుతున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని,ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని, తానే గెలవబోతున్నాననిధీమా వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికల్లో భువనగిరిలో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేల్లో వస్తుండడంతో బీఆర్ఎస్ నాయకులు మీడియాకు లీకులు ఇస్తూ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్ధులై పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈనెల 16 నుండి భువనగిరిలో నిర్వహించే హాథ్ సే హాథ్ జొడో పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపనిచ్చారు.