వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక ( Bangladesh vs Sri Lanka )మ్యాచ్ జరుగునుంది.ఈ విషయం అందరికీ తెలిసిందే.
కానీ ఈ మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటమే అందుకు కారణం.
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.ఆదివారం ఉదయం 7:00 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 460 గా నమోదయింది.దీంతో ఆదివారం బంగ్లాదేశ్ మరియు శ్రీలంక జట్లు తమ ప్రాక్టీస్ ను రద్దు చేసుకున్నాయి.బంగ్లాదేశ్ ఆటగాళ్లు సాయంత్రం మాస్కులు ధరించి కాసేపు ప్రాక్టీస్ చేస్తే.శ్రీలంక ఆటగాళ్లు పూర్తిగా ఇండోర్స్ కే పరిమితం అయ్యారు.

ఢిల్లీలో వాయు కాలుష్య( Air pollution ) కారణంగా నేడు శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మరొకవైపు ఢిల్లీలోని పరిస్థితిని బీసీసీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మ్యాచ్ నిర్వహించడంపై అప్పటి తాజా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసింది.ఢిల్లీలోని వాయు కాలుష్య పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడం కోసం బీసీసీఐ ప్రఖ్యాత పల్మనాలజిస్ట్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా సహాయం కోరింది.
ఈ టోర్నీలో ఐసీసీ నిబంధనల ప్రకారం.వాతావరణం లేదా ఇతర పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని అంపైర్లు భావిస్తే.
మ్యాచ్ ఆపోచ్చు లేదా మ్యాచ్ ఆరంభించకుండానే ఉండొచ్చు.మ్యాచ్ జరుగుతుందా లేదా అనే విషయం మ్యాచ్ కు ఒక గంట ముందు తెలియనుంది.

ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీఫైనల్ రేస్ నుంచి తప్పుకున్నాయి.శ్రీలంక( Sri Lanka ) ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం రెండు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది.
కాబట్టి నేడు జరిగే మ్యాచ్ కు సెమీస్ చేరే జట్ల ఫలితాలకు ఎలాంటి సంబంధం ఉండదు.కాకపోతే పాయింట్ల పట్టికలో చివరి స్థానాలలో ఉండడం ఏ జట్టు కూడా కోరుకోదు కాబట్టి రెండు జట్లు ఈ మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతోనే ఉన్నాయి.