మీరు గూగుల్ మీట్ వినియోగదారులా? వ్యక్తిగత లేదా గ్రూప్ కాల్స్ కోసం గూగుల్ మీట్ యాప్‌ను వినియోగిస్తున్నారా? అయితే, ఇది మీకు చేదువార్తే.ఎందుకంటే గూగుల్ మీట్‌పై దిగ్గజ కంపెనీ ఆంక్షలు విధించింది.
ఇకపై ఈ యాప్ టైం డ్యూరేషన్‌పై గ్రూప్ కాల్స్ చేసుకోవాలి.అంటే కొత్త నిబంధనలు విధించింది.
ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చేసే గూగుల్.తాజాగా గూగుల్ మీట్ యాప్‌లో మార్పులు చేపట్టింది.
తమ వినియోగదారులను ఆకట్టుకోవాలని ప్రయత్నించే గూగుల్ కొన్ని లిమిట్స్‌తో ఫ్రీ గూగుల్ మీటింగ్ వినియోగదారులకు ఇక బ్రేక్ పడనుంది.అది కూడా ఓ గంట మీటింగ్ తర్వాత.
ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇప్పటి నుంచి గూగుల్ మీట్ ద్వారా మీటింగ్ నిర్వహించుకునే వారికి 60 నిమిషాల సమయాన్ని మాత్రమే కేటాయించింది.
ఇందులో ఎంతమంది పార్టిసిపెంట్స్ అయిన ఉండవచ్చు కానీ, 55 నిమిషాల తర్వాత మీటింగ్ సమయం పూర్తి అవుతుందని అందురు పార్టిసిపెంట్స్‌కు నోటిఫికేషన్ అలర్ట్ కూడా వస్తుంది.ఈ యాప్ ఉపయోగించేవారు ఎవరికైతే జీమెయిల్ ఖాతా ఉచితంగా ఉంటుందో వారు గంటలో మీటింగ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ హోస్ట్ ఈ టైమ్ లిమిట్‌ను పెంచుకోవాలనుకుంటే గూగుల్ ఖాతాను అపగ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది.లేకపోతే గూగుల్ మీటింగ్ కాల్ గంటలో కట్ అయిపోతుంది.ఈ ఉచిత సదుపాయం లిమిట్ మద్ధతు 24 గంటల వరకు వర్తిస్తుంది.

మార్పులు చేయడానికి కారణం…
ఈ ఇంటర్నెట్ దిగ్గజం కొన్ని నెలలకు ఓసారి ఈ ప్రీ గూగుల్ మీట్ కాల్ సపోర్ట్‌ను అందిస్తుంది.2020 లోకూడా కేవలం జీమెయిల్ వినియోగదారులకు గూగుల్ మీట్ కాల్స్‌ను ఉచితంగా అందిస్తున్నామని తెలిపింది.ఆ తర్వాత గూగుల్ ఖాతాదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది.
ఈ ఆఫర్ కేవలం 2020 సెప్టెంబర్ 30 వరకు అనే టైం లిమిట్ కూడా పెట్టింది.ఈ డెడ్‌లైన్ 2021 మార్చి 31 వరకు పొడగించింది.ఈ తర్వాత మరోమారు ఆఫర్‌ను 2021 జూన్ వరకు పొడగించింది.కానీ, గూగుల్ మీట్ ఇప్పటి వరకు ఈ టై లిమిట్ కు కారణమేంటో ప్రకటించలేదు.
కేవలం యూజర్లు స్వంత సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఆధారంగా ఖాతాను అప్‌గ్రేడ్ చేసుకోవడానికే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.