కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్నకు హీరో విజయ్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.ఒక్కో సినిమాకు విజయ్ రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు.
త్వరలో తెలుగు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ తాజాగా కోర్టు చేత జరిమానా వేయించుకుని వార్తల్లో నిలిచారు.మద్రాస్ హైకోర్టు హీరో విజయ్ కు భారీ షాక్ ఇవ్వడం గమనార్హం.మద్రాస్ హైకోర్టు హీరో విజయ్ కు చీవాట్లు కూడా పెట్టింది.
2012 సంవత్సరంలో హీరో విజయ్ ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశారు.అయితే ఇంగ్లండ్ నుంచి భారత్ కు దిగుమతి చేసుకున్న ఆ కారుకు విజయ్ పన్ను చెల్లించడానికి ఇష్టపడలేదు.అ కారుకు పన్ను మినహాయింపును కల్పించాలని విజయ్ రిట్ పిటిషన్ ను దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది.
అదే సమయంలో పన్ను చెల్లించకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించినందుకు విజయ్ కు కోర్టు లక్ష రూపాయల జరిమానా విధించింది.

విజయ్ పన్ను చెల్లించకపోవడం గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే విజయ్ కారుకు పన్ను చెల్లించలేరా.? అని కామెంట్లు చేస్తున్నారు.నెటిజన్ల ప్రశ్నలకు విజయ్ ఏమని సమాధానం ఇస్తారో చూడాల్సి ఉంది.రీల్ హీరోలు పన్నులు కట్టడానికి వెనుకాడుతున్నారని కోర్టు విజయ్ గురించి షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.