విమానంలో ప్రయాణికులతో గొడవ పడిన మహిళ... ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు...

ప్రపంచంలో చాలామంది ప్రజలు ప్రతిరోజు ఎన్నో దూరప్రాణాలు చేస్తూ ఉంటారు.వాటిలో కొంతమంది రోడ్డుపై, మరి కొంతమంది విమానాల్లో, మరి కొంతమంది వారి వారి సౌకర్యం ప్రకారం సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తూ ఉంటారు.

 The Woman Who Had A Fight With The Passengers On The Delta Airlines Plane Detail-TeluguStop.com

అయితే ఇలాంటి ప్రయాణాలు చేసేటప్పుడు కొంతమంది ప్రయాణికులు వేరే ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు.అలాంటి ప్రయాణికులతో పాటు అక్కడ ఉన్న సిబ్బందితో కూడా గొడవ పడుతూ ఉంటారు.

తాజాగా అలాంటి సంఘటనే ఒక విమానాశ్రయంలో జరిగింది.ఒక మహిళ విమాన సిబ్బందిని తిట్టడంతోపాటు వారితో దురుసుగా ప్రవర్తించింది.

ఇంకా చెప్పాలంటే తోటి ప్రయాణికుడి పై వాటర్ బాటిల్ విసిరి విమానంలో రచ్చ రచ్చ చేసింది.

ఈ ఘటన అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో జరిగింది.

ఈ నెల 12న ఒక మహిళ అట్లాంటా విమానాశ్రయంలో న్యూయార్క్ వెళ్లే విమానం ఎక్కింది.ఆమె వెంట ఒక కుక్క పిల్ల తెచ్చుకుంది.ట్రావెల్‌ కేజ్‌లో ఉంచాల్సిన ఆ కుక్కను తన ఒడిలో ఉంచుకొని విమానం లోకి వచ్చింది.ఈ విషయం గమనించిన విమాన సిబ్బంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ కుక్క పిల్లను కేజ్‌లో ఉంచాలని చెప్పడంతో, ఆమె మాట వినకపోవడంతో విమానం నుంచి దిగి కిందికి వెళ్లి పోవాలని చెప్పారు.

దీంతో ఆగ్రహించిన ఆ మహిళ విమాన సిబ్బందిని తిట్టడంతోపాటు రచ్చ రచ్చ చేసింది.ఇబ్బంది కలిగించకుండా విమానం దిగాలన్న ఒక ప్రయాణికుడిపై వాటర్‌ బాటిల్‌ విసురుతున్న విషయన్ని వీడియో రికార్డు చేయడాన్ని ఆపాలంటూ కేకలు వేచి రచ్చ చేసింది.చివరకు ఆ మహిళను బలవంతంగా ఆ విమానం నుంచి విమాన సిబ్బంది కిందకు దించారు.అయితే ఆ మహిళ దురుసు ప్రవర్తనపై ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, దీంతో ఆమెను అరెస్ట్‌ చేయలేదని అట్లాంటా పోలీస్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

మరోవైవు విమానంలో ఆ మహిళ రచ్చ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube