ఈమధ్య కాలం లో బాలీవుడ్ మరియు కోలీవుడ్ చిత్రాలు కొన్ని తెలుగు స్టార్ హీరోల సినిమాలను కూడా డామినేట్ చేస్తున్నాయి.జైలర్, లియో మరియు రీసెంట్ గా విడుదలైన ‘ఎనిమల్’( Animal ) చిత్రాలు అందుకు ఉదాహరణ.
మన స్టార్ హీరోలందరూ కేవలం కమర్షియల్ మూవీస్ ఛత్రం లో ఉండిపోయారు, ఆడియన్స్ కి కూడా అది బోర్ కొట్టేసింది.ఇప్పుడు యూత్ ఆడియన్స్ మొత్తం సరికొత్త స్క్రీన్ ప్లే మరియు స్టోరీ ఉన్న సినిమాలను ఇష్టపడుతున్నారు.
ఆ సినిమాలకు మన తెలుగు హీరోల సినిమాల కంటే కూడా ఎక్కువ వసూళ్లను రాబడుతున్నాయి.ఉదహరాకి రీసెంట్ గా విడుదలైన ‘ఎనిమల్’ చిత్రాన్ని తీసుకుందాం.
అర్జున్ రెడ్డి లాంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ వంగ( Sandeep Vanga ) చేసిన ఈ సినిమాకి బాలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు.కేవలం 14 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ తెలుగు వెర్షన్ కి జరిగింది.

జరిగిన ఈ థియేట్రికల్ బిజినెస్ ని ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే దాటి సంచలనం సృష్టించింది.అదంతా పక్కన పెడితే ఈ చిత్రం నైజాం లో ‘భగవంత్ కేసరి’( Bhagwant Kesari ) 5 రోజుల వసూళ్లను కేవలం మూడు రోజుల్లోనే దాటి అందరినీ షాక్ కి గురి చేసింది.ట్రేడ్ పండితులు అందిస్తున్న వివరాల ప్రకారం ఈ సినిమా మూడు రోజుల్లోనే కేవలం తెలుగు వెర్షన్ నైజాం ప్రాంతం లో 12 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది అట.భగవంత్ కేసరి చిత్రానికి నైజాం ప్రాంతం 5 రోజులకు కలిపి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇలా తెలుగు ఆడియన్స్ కి సరిగా పేరు కూడా తెలియని హీరో కి మన స్టార్ హీరో ని డామినేట్ చేసే రేంజ్ లో వసూళ్లు వచ్చాయి అంటే యూత్ ఆడియన్స్ కొత్త తరహా కథలను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నారో మన అందరికీ తెలిసిందే.

ఇక పోతే ఈ చిత్రానికి సోమవారం వచ్చిన వసూళ్లు కూడా శనివారం రేంజ్ లో ఉన్నాయట.ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఈ చిత్రం పడినప్పటికీ కూడా ఓవరాల్ హిందీ వెర్షన్ కి కలిపి సోమవారం రోజు ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది అని తెలుస్తుంది.ఊపు చూస్తూ ఉంటే ఓవరాల్ గా ఈ చిత్రం ఫుల్ రన్ లో కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్, 500 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.