ఎప్పుడో చేసిన తప్పులు ఇప్పటికి వెంటాడుతున్నాయంటే ఇదే కావచ్చూ అసలే ముద్దపప్పు, ట్విట్టర్ పిట్ట లాంటి ప్రసిద్దమైన బిరుదులు సంపాదించుకున్న టీడీపీ ఓనర్ అయిన చినబాబు అలియాస్ నారా లోకేశ్ అధికార పార్టీ పై చేస్తున్న విమర్శలు సంచలనంగా మారడంతో నిన్న కొడాలి నాని మీటింగ్ పెట్టి ఊహించని రీతిలో పెద్ద బాబు, చిన్నబాబులను ఒక ఆట ఆడేసుకున్న విషయం తెలిసిందే.
మరో వైపు చిన్న బాబు గత సంవత్సరం చేసిన తప్పును వెతికిపట్టుకున్న పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.
కాగా పెండింగ్ కేసుల సమీక్షలో భాగంగానే ఈ కేసును పరిశీలించినట్టు వెల్లడించారు పోలీసులు ఇకపోతే గతేడాది జూన్ 12న రాత్రి 11 గంటల సమయంలో టీడీపీ నేతలు నారా లోకేశ్, కొల్లు రవీంద్ర, పట్టాభి, దేవినేని చందు, జాస్తి సాంబశివరావు తదితరులు ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయిన కింజరాపు అచ్చెన్నాయుడిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నప్పుడు అక్కడికి చేరుకున్నారు.కానీ అప్పటికే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారట అలా అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు మూల్యం వచ్చిందన్నమాట