ప్రస్తుతం ప్రపంచం మొత్తం సాంకేతికత ఆధారంగానే నడుస్తోంది.ఏది చేయాలన్నా ఎలాంటి శారీరక శ్రమ లేకుండా చాలా సులభతరమైన రీతిలో పనులు చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు లభిస్తున్న పరిస్థితి ఉంది.
రోజు రోజుకు సాంకేతికత కూడా అభివృద్ధి చెందుతూ వస్తోంది.అందుకు చక్కటి ఉదాహరణ ప్రతి ఒక్క గ్రామంలో ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ సదుపాయాలు అందుబాటులో ఉన్న పరిస్థితి ఉంది.
అంతేకాక ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ను కలిగి ఉండటమే కాకుండా చదువు రాని వారు కూడా వాట్సాప్, ఫేస్ బుక్ లను వినియోగిస్తున్నారంటే టెక్నాలజీ ఎంత మేర దూసుకు పోయిందనేది మనం అర్ధం చేసుకోవచ్చు.
అయితే టెక్నాలజీ ఇంతలా ప్రపంచమంతా రాజ్యమేలుతున్న పరిస్థితులలో అసలు టెక్నాలజీ గురించే తెలియని గ్రామం ఉందంటే నమ్మగలరా.
ఒకింత నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.కాని ఇది అక్షరాలా నిజం. అయితే ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ గ్రామం ఉన్నది ఎక్కడో కాదు అగ్రరాజ్యం అమెరికాలోనే. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నడిచే దేశమైన అమెరికాలో అసలు టెక్నాలజీ అంటే తెలియని ఒక గ్రామం ఉంది.
అక్కడ గ్రాండ్ మన్యన్ అనే లోయ ఉంది.అది మంచి పర్యాటక ప్రాంతం.

ఎంతలా అంటే ఏటా 55 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారు.అయితే ఆ లోయలో ఉన్న సుపాయ్ అనే గ్రామం ఉంది.ఆ గ్రామానికి వెళ్లాలంటే గుర్రాల మీదే వెళ్లాల్సి వస్తుందంటే ఇక ఎంత మేర ఈ గ్రామం టెక్నాలజీకి వెనుకబడి ఉందో మనం తెలుసుకోవచ్చు.అంతేకాక ఈ గ్రామంలోని వారికి కనీసం టెలిఫోన్ అంటే ఏంటో కూడా తెలియదు.
కనీసం రోడ్డు మార్గం కూడా లేదు.ఏది ఏమైనా అమెరికా లాంటి అగ్రరాజ్యం ఇలాంటి ఒక గ్రామం ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.