నయనతార ప్రెసెంట్ స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుంది.తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నయనతార అంటే తెలియని వారు ఉండరంటే పెద్ద అతిసయోక్తి కాదేమో.
అంతగా ఈ బ్యూటీ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.
ఇక ఈ లేడీ సూపర్ స్టార్ నిన్న పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే.
ప్రెసెంట్ నయనతార తో కలిసి సమంత ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న విషయం విదితమే.
ఇక ఈ సినిమాకు నయనతార ప్రియుడు విగ్నేష్ శివం దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాతో సమంత, నయనతార మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.దీంతో సామ్ నయన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెష్ తెలిపింది.

నయనతార బిజీ షెడ్యూల్ మధ్య ఎప్పుడు ఆమె పుట్టిన రోజు వేడుకలు సినిమా సెట్స్ మధ్యనే జరుగుతూ ఉంటాయి.ఇక తాజాగా నిన్న నయన్ తన పుట్టిన రోజును ‘కాథు వాకుల రెండు కాదల్’ సినిమా సెట్స్ లో జరుపుకుంది.నయన్ తన సహనటులు అయినా సామ్, విజయ్ సేతుపతి, ప్రియుడు విగ్నేష్ శివన్ మధ్య జరుపుకుంది.ఈ పుట్టిన రోజు వేడుకలు చెన్నై లో జరిగాయి.

ఈ సందర్భంగా సామ్ ఈ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ నయన్ కు స్పెషల్ విషెష్ తెలిపింది.ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఒక కవితను రాస్తూ ఆమె నయన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.”ఆమె వచ్చింది.చూసింది… దైర్యం చేసింది.కళలు కన్నది.
ప్రదర్శించింది.వాటిని జయించింది.
హ్యాపీ బర్త్ డే నయన్” అని సామ్ రాసుకొచ్చింది.సామ్ షేర్ చేసిన పిక్స్ లో సామ్, నయన్ స్నేహ బంధం ఎంత దృడంగా మారిందో తెలుస్తుంది.
ఒకరికి ఒకరు హగ్ చేసుకుని ఉన్న ఫోటోలను సామ్ షేర్ చెయ్యగా అవి కాస్త వైరల్ అయ్యాయి.