వాల్తేరు వీరయ్య విషయంలో డైరెక్టర్ బాబీ పై మండిపడుతున్న ఫ్యాన్స్.. కారణమదేనా?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు.అయితే తర్వాత నటించిన సినిమాలలో గాడ్ ఫాదర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

 The Fans Who Are Angry With Director Bobby In Waltheru Veeraya Matter Is It The-TeluguStop.com

గాడ్ ఫాదర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న చిరంజీవి తన తదుపరి సినిమాలతో బిజీ కానున్నారు.ఇకపోతే చిరంజీవి తన 154వ సినిమాని బాబి దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ముందు నుంచి ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పెట్టబోతున్నారని వార్తలు వచ్చాయి.అయితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ప్రకారం ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అంటూ దీపావళి పండుగ సందర్భంగా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.

ఇక ఈ సినిమా నుంచి దీపావళి పండుగ సందర్భంగా కేవలం టైటిల్ పోస్టర్ మాత్రమే కాకుండా ఒక చిన్న టీజర్ కూడా విడుదల చేశారు.ఇందులో మెగాస్టార్ చిరంజీవి మాస్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో చిరంజీవి లుక్ చూస్తుంటే అందరికీ ముఠామేస్త్రి సినిమా గుర్తుకు వస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లో చిరంజీవి పెద్ద ఎత్తున సిగరెట్ తాగుతూ కనిపించారు.

ఈ విషయంపై మెగా ఫాన్స్ డైరెక్టర్ బాబీ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Chirenjeevi, Bobby, Tollywood-Movie

సాధారణంగా చిరంజీవికి స్మోకింగ్ అలవాటు లేదు కానీ ఈయన తన సినిమాలలో కథ డిమాండ్ చేస్తే కేవలం మిల్క్ మేడ్ సిగరెట్స్ తాగేవారట.అయితే వాల్తేరు వీరయ్య సినిమాలో తన మాస్ లుక్ కి అనుగుణంగా సిగరెట్ కాలుస్తూ కనిపించారు.అయితే ఇందులో చిరంజీవి స్మోక్ చేయగా పొగ పెద్ద ఎత్తున వస్తున్నట్లు చూపించడంతో చిరంజీవి నిజంగానే ఇందులో స్మోక్ చేశారని చిరంజీవికి ఇష్టం లేనటువంటి పనిని డైరెక్టర్ చెబితేనే చేశారని పలువురు అభిమానులు డైరెక్టర్ పై మండిపడుతున్నారు.

చిరంజీవి గారికి అలవాటు లేనటువంటి పనిని చేస్తున్నారు అంటూ డైరెక్టర్ బాబి పై పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్ అభిమానులను ఎంతో సందడి చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube