చర్చిలోకి వెళ్లి దైవ ప్రసాదమును ఎత్తుకెళ్లిన కుక్క.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని యానిమల్ వీడియోలు మనల్ని ఆశ్చర్యపరుస్తే మరికొన్ని షాక్‌కు గురి చేస్తాయి.అయితే షాక్‌కు గురి చేసే ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

 The Dog Went To Church And Stole The Divine Favor Chruch, Dog, Taken Away, Vira-TeluguStop.com

దీన్ని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.ఇదేందయ్యా ఇది ఇలాంటి షాకింగ్ సీన్ తాము ఎన్నడూ చూడలేదని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.ఈ ఆదివారం నాడు ఒక చర్చిలో కొందరు ఫాదర్స్ ఒక క్రైస్తవ ఆరాధన సేవ మొదలుపెట్టారు.

ఈ సేవలో భాగంగా పవిత్రమైన డబుల్ రొట్టె లేదా బ్రెడ్ ఏసుప్రభువుకి అర్పించాలి ఒక టేబుల్ పై పెట్టారు.అయితే దయామయుడు ఏసుకి ప్రార్థన చేస్తుండగా చర్చలోకి ఒక కుక్క ప్రవేశించింది.

అనంతరం అది దేవునికి సమర్పించి, భక్తులందరికీ పంచి పెట్టే పవిత్రమైన రొట్టె ముక్కను ఎత్తుకొని అక్కడ నుంచి పరారైంది.ఈ విషయాన్ని చర్చి ఫాదర్స్ గమనించలేదు.

దీనికి సంబంధించిన దృశ్యాలు మాత్రం ఒక వీడియోలో రికార్డు అయ్యాయి.ఈ వీడియోని గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇది చూసిన కొందరు నెటిజన్లు షాక్ అవుతుండగా… మరికొందరు మాత్రం “పాపం ఈ కుక్క ఆకలితో ఉన్నట్లుంది.ఆ అమాయకమైన కుక్కకు ఏం తెలుసు! అది పవిత్రమైన రొట్టె అని, దేవుడు అది చేసిన తప్పును క్షమిస్తాడు” అని కామెంట్లు చేస్తున్నారు.అందరి పాపాలను క్షమించే దేవుడు అర్థం చేసుకుంటాడులే అని మరొక యూజర్ కామెంట్ పెట్టాడు.

ఇంకొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.ఇదే ఆరాధన సేవలో వైన్ కూడా పంచిపెడతారు.

ఆ వైన్ బాటిల్ కూడా ఈ కుక్క ఎత్తుకెళ్లాల్సింది.అప్పుడు ఓనర్ కూడా ఖుషి అయ్యేవాడు అని ఒక నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశారు.

ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube