సౌత్ ఇండస్ట్రీలో బాలీవుడ్ హీరోల రచ్చ... ఒకరి తర్వాత ఒకరు ఇప్పటికి ఎంతమందోచ్చారో తెలుసా?

మామూలుగా టాలీవుడ్ ఇండస్ట్రీ కంటే బాలీవుడ్ ఇండస్ట్రీకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది.అంతే కాకుండా బాలీవుడ్ సినిమాలకు కూడా ఒక స్పెషల్ ఇంపార్టెంట్ ఉంటుంది.

 The Bollywood Heroes In The South Industry Do You Know How Many Numbers Came , B-TeluguStop.com

అందుకే టాలీవుడ్ నటీనటులు బాలీవుడ్ లోకి వెళ్లాలని బాగా ఆసక్తి చూపుతారు.కానీ బాలీవుడ్ నటులే టాలీవుడ్ లో కూడా ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే చాలా మంది నటులు పరిచయం కాగా వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.

సునీల్ శెట్టి: బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమాలో విలన్ గా నటించాడు.అందులో విలన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు.అంతేకాకుండా మంచు విష్ణు నటించిన మోసగాళ్లు సినిమాలో కూడా ప్రధాన పాత్రల్లో నటించాడు.

Telugu Akshay Kumar, Bollywood, Jackie Shroff, Nanapatekar, Bollywoodheroes, Tol

అమితాబ్ బచ్చన్: బాలీవుడ్ మెగా స్టార్ హీరో అమితాబచ్చన్ గురించి అందరికీ తెలిసిందే.ఈయన టాలీవుడ్ లో నటించాడు అంటే ఎంతోమంది ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో అమితాబ్ నటించాడు.అందులో అమితాబ్ గోసాయి వెంకన్న పాత్రలో నటించగా తన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నాడు.నాగార్జున నటించిన మనం సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించాడు.

సంజయ్ దత్: సంజయ్ దత్ నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమాలో కాసేపు మాత్రమే కనిపించారు.ఇక ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్ 2 లో కూడా విలన్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Telugu Akshay Kumar, Bollywood, Jackie Shroff, Nanapatekar, Bollywoodheroes, Tol

వివేక్ ఓబెరాయ్ – శత్రఘ్న సిన్హా: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ నటులు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రక్త చరిత్ర సినిమాలో వివేక్ ఒబెరాయ్, శత్రఘ్న తమ పాత్రలతో బాగా అదరగొట్టారు.

జాకీ ష్రాఫ్: బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ టాలీవుడ్ లో చాలా సినిమాలలో నటించాడు.అందులో అస్త్రం, శక్తి, పంజా, సాహో సినిమాలో నటించగా తన పాత్ర వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Telugu Akshay Kumar, Bollywood, Jackie Shroff, Nanapatekar, Bollywoodheroes, Tol

అనిల్ కపూర్: బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ బాపు దర్శకత్వంలో తెరకెక్కిన వంశవృక్షం సినిమాలో నటించగా ప్రస్తుతం మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

అక్షయ్ కుమార్: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.ఇక ఈయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో 2.0 సినిమాలో పక్షి రాజు పాత్రలో నటించగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ తో విడుదలైంది.

Telugu Akshay Kumar, Bollywood, Jackie Shroff, Nanapatekar, Bollywoodheroes, Tol

నానాపటేకర్: నటుడు నానాపటేకర్ కూడా తెలుగు సినిమాలలో నటించాడు.హీరో అర్జున్ నటించిన ‘రానా’ లో నటించగా.రజినీకాంత్ నటించిన కాలా సినిమాలో కూడా నటించాడు.

ఇక ప్రస్తుతం చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ తొలిసారిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నారు.

ఇక వీళ్లే కాకుండా అర్జున్ రాంపాల్, మిథున్ చక్రబర్తి, అర్బాజ్ ఖాన్, విద్యుత్ జమ్వాల్, రవి కిషన్, నీల్ నితీష్ కుమార్, చుంకీ పాండే, అభయ్ డియోల్, సైఫ్ అలీ ఖాన్, రాజేష్ కన్నా తదితరులుకూడా నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube