ఈ మధ్య క్రికెట్ లో అద్బుతాలు జరుగుతున్నాయి.క్యాచ్ లు పడుతున్న తీరు ఔరా అని అనిపిస్తోంది.
అభిమానులు ఆ క్యాచ్ లు పడుతున్న తీరుకు ఫిదా అయిపోతున్నారు.సోషల్ మీడియాలో ఆ క్రికెటర్లు పట్టిన క్యాచ్ ల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా అలాంటిదే ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.విండీస్ బౌలర్ ఫాబియన్ అలెన్ ఆసీస్‌తో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో అద్బుతమైన క్యాచ్‌తో అలరించడం విశేషం.
మొదటగా బౌలింగ్‌లో కీలకమైన మిచెల్ మార్ష్ వికెట్ ను అతను తీశాడు.ఆ తర్వాత రెండు క్యాచ్‌లతో ఇదరగదీశాడు.
అందులో ఒకటి బౌండరీ లైన్ వద్ద పట్టాడు.ఆ సమయంలో ఇంకో ఆటగాడిని సమన్వయం చేసుకుంటూ అలెన్ క్యాచ్ ను అందుకోవడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిపోయింది.
ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో హెడెన్ వాల్స్ వేసిన ఐదో బంతిని కెప్టెన్ ఆరోన్ ఫించ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడటంతో అందరూ అది సిక్సేనని అనుకున్నారు.అయితే అంతా అలా భావిస్తున్న సమయంలో లాంగాన్ అటు మిడ్ వికెట్ నుంచి బ్రేవో, అలెన్‌లు పరిగెత్తుకొని వచ్చారు.బ్రేవో అప్పటికే బాల్ పట్టుకునే ప్రయత్నం చేయగా అతని చేతుల నుంచి ఆ బాల్ జారిపోయింది.అంతలోనే అలెన్ బాల్ ని కాస్త దూరంలో ఉన్నా కూడా తన కాళ్లను స్ట్రెచ్ చేస్తూ అందుకునేశాడు.
అంతే ఫామ్‌లో ఉన్న ఫించ్ పెవిలియన్‌కు చేరిపోయాడు.క్యాచ్ పట్టడంతో విండీస్ క్రికెటర్లు సంబరాలు చేసుకున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.ఈ మ్యాచ్‌లో హార్డ్ హిట్టర్ గేల్ సునామీతో విండీస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.ఇక గేల్ ఇదే మ్యాచ్‌లో ఇంకో అద్బుత రికార్డును బద్దలు కొట్టాడు.టీ20 ఫార్మాట్‌లో 14వేల పరుగులు అందుకున్న తొలి ఆటగాడిగా గేల్ రికార్డు కెక్కాడు.