ఇంట్లో నానమ్మపై కాల్పులు... ఆ తర్వాత స్కూల్‌లో మారణహోమం, టెక్సాస్ ఘటనలో కొత్త కోణం

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ పాఠశాలలో ఉన్మాది జరిపిన కాల్పుల్లో 19 మంది చిన్నారులుసహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్న వార్తతో ప్రపంచం ఉలిక్కిపడింది.ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు నిందితుడిని హతమార్చారు.

 Texas School Shooting : Accused Salvador Ramos Shoot His Grandmother Before Killing Students Texas ,parkland , Kamala Harris , School Shooting , Salvador Ramos , Grandmother, America, Joe Biden , 19 Children Died-TeluguStop.com

అయితే అతను ఎవరు.ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.నిందితుడు సాల్వాడర్ రామోస్‌ ఈ నరమేధానికి ముందు తన ఇంట్లోనే ఓ ఘాతుకానికి పాల్పడ్డాడు.

 Texas School Shooting : Accused Salvador Ramos Shoot His Grandmother Before Killing Students Texas ,Parkland , Kamala Harris , School Shooting , Salvador Ramos , Grandmother, America, Joe Biden , 19 Children Died-ఇంట్లో నానమ్మపై కాల్పులు#8230; ఆ తర్వాత స్కూల్‌లో మారణహోమం, టెక్సాస్ ఘటనలో కొత్త కోణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సొంత నానమ్మపై కాల్పులు జరిపిన అతను.అదే గన్‌తో పాఠశాలకు వచ్చి తోటి విద్యార్ధులను పొట్టనబెట్టుకున్నాడు.

మరోవైపు సాల్వాడర్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని పోలీసులు ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.మరోవైపు నిందితుడు ఇటీవలే తుపాకీని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.అతని సోషల్ మీడియాలో పోస్ట్‌లను బట్టి పోలీసులు నిర్ధారణకు వచ్చారు.తుపాకీకి సంబంధించిన ఫోటోలను సాల్వాడర్ తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

Telugu America, Grandmother, Joe Biden, Kamala Harris, Parkland, Salvador Ramos, School, Texas-Telugu NRI

అటు టెక్సాస్ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.దేశంలో గన్ లాబీకి వ్యతిరేకంగా నిలబడాలని ఆయన పేర్కొన్నారు.పిల్లలు శాశ్వతంగా దూరమయ్యారనే క్షోభ తల్లిదండ్రులను వెంటాడుతూనే వుంటుందన్నారు.

ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.అమెరికాలో ఇలాంటి వాటికి చోటివ్వకూడదని.

చర్యలు తీసుకునేందుకు ధైర్యం చేయాలని ఆమె వ్యాఖ్యానించారు.ఇకపోతే.2018లో ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో జరిగిన కాల్పుల్లో 14 మంది హైస్కూల్ విద్యార్ధులు సహా ముగ్గురు టీచర్లు మరణించారు.ఇది అప్పట్లో యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

దాని తర్వాత తాజాగా టెక్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటన అత్యంత దారుణమైనదిగా పోలీసులు చెబుతున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube