దేవుడి విగ్రహాలకు పూజ చేసే పద్దతి.. కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

మన హిందూ సంప్రదాయాల ప్రకారం పూజకు ఉపక్రమించే ముందు చాలా పనులు చేయాల్సి ఉంటుంది.ఎప్పుడు పడితే అప్పుడు పూజ చేయకూడదు.

 Poeple Must Know The Method Of Worshiping For Idols , Devotional , How To Do Pu-TeluguStop.com

ముఖ్యంగా పూజ చేసే విధానంలో స్త్రీలుకు, పురుషులకు కాస్త తేడా ఉంటుంది.అయితే ఆ విధానాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పురుషులు అయితే తలకు స్నానము చెయ్యవలసి ఉంటుంది.స్త్రీలు కంఠం వరకు స్నానం చేసినా సరిపోతుంది.స్నానం చేసిన తరువాత తడి లేని పొడి బట్టలు కట్టుకుని నుదుట కుంకుమ పెట్టుకోవాలి.నిత్య విధులు నిర్వర్తించాలి.

పూజ గదికి వెళ్ళి ముందు రోజు పెట్టిన గంధం, పువ్వులు తీసివేయాలి.దీపం వెలిగించి మళ్లీ కొత్తగా చందనం, కుంకుమ పెట్టి పుష్పాలు సమర్పించాలి.

ఆ తర్వాత అగరు వత్తులు ధూపం, దీపం సమర్పించి పాలు, పళ్ళు, ద్రాక్ష మొదలైనవి నైవేద్యంగా పెట్టాలి.

Telugu Devotional, Puja, Puja Vidhanam, Idols-Telugu Bhakthi

ఆ తరువాత హారతి కర్పూరం వెలిగించి, దీపారాధన చెయ్యాలి.హారతి కళ్ళకద్దు కుని, పువ్వులు తీసుకుని పుష్పాంజలి సమర్పించి నమస్కారం చెయ్యాలి.విగ్రహ పూజ చేయాలి అనుకునే వారు ఎవరైనా ఆ విషయం, వివరాలు తెలిసిన పెద్ద వారి వద్ద ఆయా మూర్తికి సంబంధించిన మంత్రాలు ఉపదేశం పొంది విగ్రహ పూజ చేయవచ్చును.

స్త్రీలు ఉపదేశం పొందినా సరే పంచ లోహ విగ్రహ మూర్తులను మాత్రము తాకి పూజ చేయ వచ్చునే కాని పంచాయతన పూజా మూర్తులను తాకి అర్పించ కూడదు.ఇలాంటి అన్ని నియమాలను పాటించి పూజ చేస్తేనే ఆ ఫలితం మీకు దక్కుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube