ఈ హీరోయిన్ 22 ఏళ్లకే పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీ ని వదిలిపెట్టి ప్రస్తుతం...

తెలుగులో ప్రముఖ దర్శకుడు కే.విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన “స్వయంవరం” చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ హీరోయిన్ “లయ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Telugu Veteran Heroine Laya Real Life Story,laya, telugu Veteran Heroine-TeluguStop.com

 అయితే అంతకు ముందే “భద్రం కొడుకో” అనే చిత్రంలో లయ నటించినప్పటికీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఈమెకి పెద్దగా గుర్తింపు రాలేదు.

కానీ తన రెండవ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడంతో వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

అయితే ఇందులో మనసున్న మారాజు, శివరామరాజు, మనోహరం, ప్రేమించు, విజయేంద్ర వర్మ, తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని బాగానే ఆకట్టుకోవడంతో పాటూ మంచి గుర్తింపు తెచ్చాయి.ఒకానొక సమయంలో చేతినిండా సినిమా అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో అమెరికాలో డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్నటువంటి ఓ ప్రముఖ వైద్యుడు ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యింది. 

ప్రస్తుతం ఒక బాబు, పాప కూడా ఉన్నారు.  ఆ మధ్య టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించినటువంటి అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రంలో తన కూతురు శ్లోక తో కలిసి నటించింది.

అతి చిన్న వయసులో నటిగా సినిమా పరిశ్రమకు పరిచయమై పెళ్లి చేసుకున్న అనంతరం తన కుటుంబ బాధ్యతల కోసమై నటి లయ సినిమా కెరీర్ ను కూడా వదులుకుంది.

అయితే ఆ మధ్య కాలంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో నటి లయ పాల్గొంది.

ఇందులో భాగంగా తనకు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం వస్తే మళ్లీ తాను సినిమాల్లో నటించేందుకు సిద్ధమేనంటూ తెలిపింది.అంతేగాక తాను ప్రస్తుతం తాను తన భర్త పిల్లలతో కలిసి అమెరికాలో ఉండడం వల్ల సినిమాల్లో నటించలేకపోతున్నానని తన అభిప్రాయాన్ని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube