బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ వరుణ్ ధావన్ తో కలిసి నటించిన భేడియా సినిమా ప్రొమోషన్స్ లో బిజీగా ఉంది.ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఈమె మన టాలీవుడ్ లో తనకు ఇష్టమైన సినిమాలు ఏంటో చెప్పేసింది.
ప్రెజెంట్ మన టాలీవుడ్ సినిమా ఏ రేంజ్ లో సత్తా చాటుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
గత డిసెంబర్ లో వచ్చిన పుష్ప దగ్గర నుండి మొన్న మొన్న వచ్చిన కార్తికేయ 2 వరకు అనేక తెలుగు సినిమాలు బాలీవుడ్ లో తమ సత్తా చాటుతున్నాయి.
దీంతో ఈ సినిమాలన్నీ ఇండియన్ సినిమా దగ్గర మన తెలుగు సత్తా చాటి చెబుతున్నాయి.దీంతో అందరి ద్రుష్టి మన టాలీవుడ్ మీద పడింది.హిందీ సినిమాలు కూడా ఇక్కడ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.మరి ప్రెజెంట్ హిందీ సినిమాల్లో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా భేడియా.
ఈ సినిమాను తోడేలు పేరుతో మన తెలుగులో రిలీజ్ చేసున్నారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ లో జరిగిన ప్రొమోషన్స్ లో భాగంగా ఈమె తన ఫేవరేట్ తెలుగు సినిమాలు ఏంటో రివీల్ చేసింది.కృతి సనన్ కు ఇష్టమైన సినిమాలు అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో పాటు.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా అని చెప్పుకొచ్చింది.
ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఆమె మహేష్ 1 నేనొక్కడినే సినిమా తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు ఆదిపురుష్ లో ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది.దీంతో ఈమె పేరు మారుమోగి పోయింది.ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ ఖర్చుతో నిర్మించిన ఈ సినిమా 2023, జూన్ 16న రిలీజ్ కానుంది.