నటి ప్రగతితో కలిసి డ్యాన్స్ చేసిన ఈ అమ్మాయి ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సినిమాలలో ఎక్కువగా హీరో హీరోయిన్ లకు తల్లి పాతల్లో నటిస్తూ నటిగా ముందు గుర్తింపు ఏర్పరచుకుంది.

 Full Details Of Viral Girl From Pragathi Viral Dance Details, Pragathi, Sneha Mu-TeluguStop.com

ఇప్పటికీ ఒక వైపు సినిమాలో నటిస్తూనే ఉంది ప్రగతి.ఇది ఇలా ఉంటే ప్రగతి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.మరి ముఖ్యంగా తన జిమ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అలాగే డాన్స్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా తన ఇన్‌ స్టాగ్రామ్‌ ఖాతాలో ప్రముఖ్‌ బాలీవుడ్‌ సింగర్‌, ర్యాపర్‌ బాద్‌ షా ఊడూ అనే ట్రెండింగ్‌ సాంగ్ కు స్టెప్పులేసింది.ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

అయితే ఆ వీడియోలో నటి ప్రగతితో పాటు మరో యువతి కూడా స్టెప్పులేసింది.అంతా ప్రగతి పక్కన సూపర్‌ స్టెప్పులేసిన యువతిని చూసి ప్రగతి కుమార్తె అని అనుకుంటున్నారు.

అంతేకాకుండా సోషల్‌ మీడియాలో కుమార్తె కంటే నటి ప్రగతినే బాగా డాన్స్‌ చేస్తోందంటూ కొందరు, తల్లిలాగానే కూతురు కూడా సూపర్‌ డాన్సర్‌ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.

కానీ అందరూ అనుకున్నవిధంగా ప్రగతితో డాన్స్‌ చేసిన యువతి ఆమె కుమార్తె కాదు.ప్రగతితో డాన్స్‌ చేసిన స్నేహా మురళి.ఈమె తమిళ అమ్మాయి.

తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో బాగా ఫేమస్‌ అయిన నటి జయా మురళి కుమార్తె, స్నేహా మురళి కూడా నటే.కాగా సినిమాలలో పద్ధతిగా కనిపించే ప్రగతి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో వీడియోలతో రెచ్చిపోతూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube